ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CBI Vs RJD : తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు... సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు...

ABN, First Publish Date - 2023-03-11T15:26:52+05:30

ఉద్యోగాలు ఇచ్చేందుకు భూములను ప్రతిఫలంగా పొందిన కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)కు సీబీఐ

Nitish Kumar, Tejaswi Yadav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

CBI Vs RJD : తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు... సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు...

పాట్నా : ఉద్యోగాలు ఇచ్చేందుకు భూములను ప్రతిఫలంగా పొందిన కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)కు సీబీఐ (Central Bureau of Investigation-CBI) సమన్లు జారీ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ఘాటుగా స్పందించారు. 2017లో కూడా ఇలాగే జరిగిందని, అప్పుడు తాము (జేడీయూ, ఆర్జేడీ) విడిపోయామని చెప్పారు. ఐదేళ్లు గడచిపోయాయని, తాము కలిసిన తర్వాత మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం (Land for jobs scam)లో ప్రశ్నించవలసిన అవసరం ఉందని, తమ కార్యాలయంలో హాజరుకావాలని తేజస్వి యాదవ్‌ను సీబీఐ పిలిచినట్లు వార్తలు వచ్చిన వెంటనే నితీశ్ కుమార్ శనివారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘2017లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు మేము (జేడీయూ-ఆర్జేడీ) (JDU, RJD) విడిపోయాం. ఐదేళ్లు గడచిపోయాయి. మేం తిరిగి కలిసినపుడు, మళ్లీ దాడులు జరుగుతున్నాయి. నేనేం చెప్పగలను?’’ అని అన్నారు.

కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పని చేసిన సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2017లో సీబీఐ దాడులు జరిగాయి. అప్పట్లో బిహార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూ విడిపోయాయి. జేడీయూ, బీజేపీ (BJP) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ మళ్లీ బీజేపీని వదిలేసి, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, మరికొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.

ఇదిలావుండగా, తేజస్వి యాదవ్ సీబీఐ విచారణకు హాజరయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఆయన సతీమణి రాజ్‌శ్రీ యాదవ్ గర్భిణి అని, ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. ఈ కారణాన్ని చూపుతూ తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి సమాచారం ఇచ్చే యోచనలో తేజస్వి ఉన్నట్లు ఆర్జేడీ వర్గాలు చెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Kavitha ED Enquiry Live Updates: కవిత ఈడీ విచారణ మొదలై ఎన్ని గంటలైందంటే..

Satyavati Rathod: ‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోండి.. మీకూ కుటుంబం ఉంది’

Updated Date - 2023-03-11T15:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising