ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharad pawar: బీజేపీతో జతకట్టం... తేల్చిచెప్పిన శరద్ పవార్

ABN, First Publish Date - 2023-10-04T20:33:48+05:30

మహారాష్ట్రలో తమ పార్టీ బీజేపీ తో చేతులు కలిపే ప్రసక్తే లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

ముంబై: మహరాష్ట్ర (Maharashtra)లో తమ పార్టీ బీజేపీ (BJP)తో చేతులు కలిపే ప్రసక్తే లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad pawar) చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురువుతారని తాను అనుకోవడం లేదని చెప్పారు. 2019లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే వెన్నుపోటు వేయడంతో బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో శరద్ పవార్ అనుకున్నట్టు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న నేపథ్యంలో శరద్ పవార్ తాజా వ్యాఖ్యలు చేశారు.


ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే..

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే లేదని, మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే శివసేనతో కూడిన మహావికాస్ అఘాడి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవార్ ధీమా వ్యక్తం చేశారు.


ఆప్ ఎంపీ అరెస్టు ప్రతీకార చర్చే..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో 'ఆప్' ఎంపీ సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ఆయన మాట్లాడుతూ, ఇది నేరుగా ఎంపీపైన, పరోక్షంగా అరవింద్ కేజ్రీవాల్‌పైన తీసుకున్న ప్రతీకార చర్య అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి (కేంద్రంలో) సరిపడని రాజకీయ వ్యక్తులపై సీబీఐ, ఈడీలను ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. ఈడీ చర్య వల్లతో 'ఇండియా' బ్లాక్‌లో ఉన్న ఆప్, కాంగ్రెస్‌లు మరింత చేరువవుతాయని వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌కు 3 సీట్లు ఇచ్చేందుకు ఆప్ రెడీ..

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో తాను ఇటీవల మాట్లాడానని, లోక్‌సభ సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో చర్చిచేందుకు, 7 పార్లమెంటు సీట్లలో 3 సీట్లు కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కేజ్రీవాల్ తనతో చెప్పారని పవార్ వెల్లడించారు.

Updated Date - 2023-10-04T20:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising