ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Train Accident: వైరల్ అవుతున్న ఫొటో.. అంత ఘోర రైలు ప్రమాదం జరిగితే ఈ కుర్రాళ్లు క్యూ లైన్‌లో ఎందుకున్నారంటే..

ABN, First Publish Date - 2023-06-03T12:27:58+05:30

ఆపదలో చేయూతనిచ్చినవాడిని దేవుడిలా వచ్చి ఆదుకున్నావు బాబూ అని అంటాం. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నవారిని ఆదుకోవడమే మానవత్వం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాసోర్ : ఆపదలో చేయూతనిచ్చినవాడిని దేవుడిలా వచ్చి ఆదుకున్నావు బాబూ అని అంటాం. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నవారిని ఆదుకోవడమే మానవత్వం. అది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. స్వయంగా మనసులో నుంచి ఉవ్వెత్తున జ్వాల ఎగసిపడాలి. అలాంటివారు వందలు, వేల సంఖ్యలో ఉన్నారని ఒడిశా వాసులు రుజువు చేశారు. మూడు రైళ్లు ప్రమాదానికి గురై, వందలాది మంది దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, వారిని ఆదుకోవడం కోసం రక్తదానం చేస్తామంటూ వందలాది మంది బాలాసోర్ ఆసుపత్రులకు రాత్రికి రాత్రి రావడం అభినందనీయం. అయితే వారు ఇతరుల అభినందనల కోసం వచ్చినవారు కాదు. కేవలం మానవతావాదంతో వచ్చినవారు. రక్తదానం చేయడం కోసం వందలాది మంది బారులు తీరినట్లు కనిపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని, ఆ తర్వాత షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడిందని, అంతేకాకుండా ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపై పడిందని తెలుస్తోంది. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరిందని, గాయపడినవారి సంఖ్య 1,000 దాటిందని తెలుస్తోంది.

మోదీ పరామర్శ

రైలు ప్రమాదంపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు శనివారం ఈ ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నారు. మొదట ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఆ తర్వాత కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారు.

స్థానికుల మానవత్వం

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే స్థానికులు మానవత్వంతో స్పందించి, అనేక విధాలుగా అధికారులకు సహాయపడ్డారు. గాయపడినవారికి చికిత్స చేయడానికి రక్తం అవసరం అవుతుంది కాబట్టి, బాలాసోర్‌లోని ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేయడానికి వందలాది మంది బారులు తీరారు. ఆసుపత్రుల్లో చేరిన క్షతగాత్రుల ఆర్తనాదాలు ఓవైపు, రక్తదానం చేయడానికి వచ్చినవారిలో ఉప్పొంగుతున్న మానవత్వం మరోవైపు, ఈ సన్నివేశాలను చూసినవారి హృదయం ద్రవిస్తోంది.

బాలాసోర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి మాత్రమే కాకుండా వారి బంధువులకు కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం రాత్రి దాదాపు 2,000 మంది స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి బాలాసోర్ వైద్య కళాశాల, ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వీరిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. రాత్రి 500 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా ట్వీట్ చేశారు. మరో 900 యూనిట్ల రక్తం నిల్వ ఉందని తెలిపారు. అత్యుత్తమ ప్రయోజనం కోసం స్వచ్ఛందంగా రక్తదానం చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

స్థానికుల సహకారం గురించి బాధిత ప్రయాణికులు కూడా చెప్తున్నారు. స్థానికులు తమను ఎంతగానో ఆదుకున్నారని, తమ లగేజ్‌ను తిరిగి తమ వద్దకు చేర్చడానికి వారు చాలా శ్రమించారని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

Updated Date - 2023-06-03T12:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising