Karnataka : కర్ణాటకలో ఈ ముగ్గురిదీ ఓ ప్రత్యేకత!
ABN, First Publish Date - 2023-05-10T16:17:56+05:30
కర్ణాటక రాష్ట్రం 1956లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిని పూర్తిగా ఐదేళ్లు నిర్వహించినవారు కేవలం ముగ్గురే ఉన్నారు.
న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రం 1956లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిని పూర్తిగా ఐదేళ్లు నిర్వహించినవారు కేవలం ముగ్గురే ఉన్నారు. ఎస్ నిజలింగప్ప (1962-68), డీ దేవరాజ ఉర్స్ (1972-77), సిద్ధరామయ్య (2013-2018) మాత్రమే పూర్తి పదవీ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. వీరంతా కాంగ్రెస్ నేతలే.
బీజేపీ, జేడీఎస్ నేతలు ముఖ్యమంత్రి పదవిని ఐదేళ్ళ కాలం పూర్తిగా నిర్వహించలేకపోయారు. బీజేపీ-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు హెచ్‌డీ కుమార స్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ ప్రభుత్వం 2006 ఫిబ్రవరి నుంచి 2007 అక్టోబరు వరకు మాత్రమే ఉంది. బీజేపీ నేతకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడానికి కుమార స్వామి ససేమిరా అనడంతో ఈ ప్రభుత్వం కూలిపోయింది.
కాంగ్రెస్, జేడీఎస్ కలిసి 2018లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో కుమార స్వామి రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. బీజేపీ నేత బీఎస్ యెడియూరప్ప 2007లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. జేడీఎస్ మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజులకే పదవిని కోల్పోయారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
యెడియూరప్ప నేతృత్వంలో బీజేపీ 2008 మే నెలలో కర్ణాటకలో ఘన విజయం సాధించింది. ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన 2011 జూలైలో పదవి నుంచి వైదొలగారు. ఆయన 2018 మే 17న మూడోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. శాసన సభలో ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ఆయన మే 23 వరకు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ 2021 జూలైలో బాధ్యతలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
Karnataka Election : ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. : ప్రముఖులు
Updated Date - 2023-05-10T16:17:56+05:30 IST