Jaipur: జైపూర్ ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31కోట్ల నగదు,కిలో బంగారం లభ్యం

ABN , First Publish Date - 2023-05-20T14:13:52+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌ నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయం బేస్‌మెంట్‌లో రూ.2 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని నగదు, కిలో బంగారం లభ్యం అయిన ఘటన సంచలనం రేపింది...

Jaipur: జైపూర్ ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31కోట్ల నగదు,కిలో బంగారం లభ్యం
unclaimed cash, 1kg gold found

జైపూర్‌ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌ నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయం బేస్‌మెంట్‌లో రూ.2 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని నగదు, కిలో బంగారం లభ్యం అయిన ఘటన సంచలనం రేపింది.(Jaipur)యోజన భవన్‌లోని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యాలయం బేస్ మెంట్ (basement of govt office) నుంచి జైపూర్ పోలీసులు రూ.2.31 కోట్ల నగదు, ఒక కిలో బంగారు కడ్డీని (unclaimed cash, 1kg gold found)గుర్తించారు. దీనికి సంబంధించి కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదనపు డైరెక్టర్ మహేష్ గుప్తా అందించిన సమాచారం ఆధారంగా జైపూర్ నగర పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన కార్యదర్శి ఉషా శర్మ, డీజీపీ, జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవను కలిసి అర్థరాత్రి ఐటి డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్ తమ బేస్‌మెంట్‌లో నగదు, బంగారు కడ్డీని కనుగొన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు.దీనిపై తాము 102 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు.‘‘సీసీటీవీ ఫుటేజీని శోధిస్తున్నాం.దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్‌కు కూడా సమాచారం అందించాం’’అని ఆనంద్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

Updated Date - 2023-05-20T14:13:58+05:30 IST