ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress : భారత్‌కు తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ... పార్లమెంటుకు వెళ్తారా?...

ABN, First Publish Date - 2023-03-15T11:06:48+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్రిటన్ పర్యటన ముగించుకుని తిరిగి భారత దేశానికి వచ్చారు. ఆయన బుధవారం

Smriti Irani, Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్రిటన్ పర్యటన ముగించుకుని తిరిగి భారత దేశానికి వచ్చారు. ఆయన బుధవారం పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన భారత దేశ ప్రజాస్వామ్యంపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మీద ఆయనకుగల ద్వేషం భారత దేశంపై విద్వేషంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.

రాహుల్ గాంధీ భారత దేశ ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యల దుమారం పార్లమెంటులో కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల రెండో భాగం సోమవారం ప్రారంభమైనప్పటి నుంచి అధికార, విపక్షాల సభ్యులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటూ, క్షమాపణలు చెప్పాలని ఒకరినొకరు డిమాండ్ చేస్తున్నారు.

పార్లమెంటు సమావేశాలు బుధవారం ప్రారంభమవడానికి ముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Union Minister Smriti Irani) మీడియాతో మాట్లాడుతూ, ఇంగ్లండ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగాలకు అబద్ధాలే పునాదులని దుయ్యబట్టారు. ఆయన అక్కడికి వెళ్లి అనేక అబద్ధాలు చెప్పారన్నారు. భారత దేశంలోని విశ్వవిద్యాలయాల్లో మాట్లాడటానికి తనకు అవకాశం రావడం లేదని ఆయన ఆరోపిస్తున్నారని, అది ప్రజాస్వామ్యం చచ్చిపోవడానికి సంకేతమని చెప్తున్నారని మండిపడ్డారు. దేశ రాజధాని నగరంలోని ఓ విశ్వవిద్యాలయానికి ఆయన 2016లో వెళ్లారని, భారత దేశాన్ని ముక్కలు చేస్తామంటూ కొందరు నినాదాలు చేస్తూ ఉంటే, వారికి ఆయన మద్దతిచ్చారని గుర్తు చేశారు. ఆయన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) వెళ్లినపుడు భారత దేశంలో అంతా బాగుందని చెప్పారన్నారు. ఈ రెండిటిలో ఏది అబద్ధం? అని ప్రశ్నించారు. బ్రిటన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని భారత దేశం డిమాండ్ చేస్తోందన్నారు.

‘‘భారత దేశ పార్లమెంటు (Parliament)కు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ప్రతి భారతీయుడు డిమాండ్ చేస్తున్నాడు. భారత దేశానికి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలకు పార్లమెంటుకు వచ్చి క్షమాపణ చెప్పడానికి బదులుగా, ఆయన పార్లమెంటుకు గైర్హాజరవుతున్నారు’’ అని స్మృతి ఇరానీ అన్నారు.

రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌ (Britain)లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ, భారత దేశ ప్రజాస్వామ్య మౌలిక నిర్మాణంపై కిరాతక దాడి జరుగుతోందన్నారు. బీజేపీ (BJP), ఆరెస్సెస్ (RSS) అన్ని వ్యవస్థలను కబ్జా చేశాయన్నారు.

ఇవి కూడా చదవండి :

Minister: ఆ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం

Land for jobs Case : కోర్టుకు హాజరైన లాలూ దంపతులు

Updated Date - 2023-03-15T11:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising