ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : దిగ్విజయ సింగ్‌కు భారీ షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2023-01-24T14:44:57+05:30

రక్షణ దళాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఆ పార్టీ

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రక్షణ దళాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రక్షణ దళాలను తాము నమ్ముతామని, అవి తమ పనిని తాము అసాధారణంగా చేస్తున్నాయని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై తమ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు.

దిగ్విజయ సింగ్ సోమవారం జమ్మూ-కశ్మీరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, నియంత్రణ రేఖ (LOC) వెంబడి 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో జరిగిన పుల్వామా దాడులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మోదీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడతారని, చాలా మందిని చంపేశామంటారని, కానీ అందుకు రుజువులు మాత్రం చూపించరని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారన్నారు.

దిగ్విజయ సింగ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ స్పందిస్తూ, నరేంద్ర మోదీపై ద్వేషంతో రక్షణ దళాలను కాంగ్రెస్ అవమానిస్తోందని దుయ్యబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్‌లో, కాంగ్రెస్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రశ్నిస్తోందని, పుల్వామాపై పాకిస్థాన్ వైఖరిని ఆ పార్టీ ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడుల విషయంలో కూడా దిగ్విజయ సింగ్ భారత దేశాన్ని నిందించారన్నారు.

దూరం... దూరం...

దీంతో కాంగ్రెస్ స్పందిస్తూ, దిగ్విజయ సింగ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పింది. సింగ్ వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించబోవని తెలిపింది. దిగ్విజయ మంగళవారం స్పందిస్తూ, తనకు సైనికులంటే గొప్ప గౌరవం ఉందన్నారు.

నమ్మకం ఉంది

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, తాము రక్షణ దళాలను నమ్ముతున్నామని చెప్పారు. అవి తమ పనిని తాము అసాధారణంగా నిర్వహిస్తున్నాయన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీనిపై స్పందించిందన్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర జమ్మూ-కశ్మీరులో సాగుతోంది. ఈ నెల 30తో ఇది ముగుస్తుంది.

సర్జికల్ స్ట్రైక్స్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం 2016 సెప్టెంబరులో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అదే సంవత్సరం సెప్టెంబరు 18న పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు కశ్మీరులోని ఉరిలో ఉన్న సైనిక స్థావరంపై దాడి చేశారు. దీనికి దీటైన సమాధానం చెప్పడం కోసం అదే నెల 28న ఈ సర్జికల్ స్ట్రైక్స్‌ను భారత సైన్యం నిర్వహించింది.

పుల్వామా దాడి

జమ్మూ-కశ్మీరులోని పుల్వామా జిల్లా, లెథపొర సమీపంలో సైనిక వాహనాలపై ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ దారుణం 2019 ఫిబ్రవరి 14న జరిగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 40 మంది సైనికులు అమరులయ్యారు.

Updated Date - 2023-01-24T14:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising