ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Railway Constable : రైల్వే కానిస్టేబుల్‌ ఘాతుకం!

ABN, First Publish Date - 2023-08-01T02:38:56+05:30

అతడో రైల్వే కానిస్టేబుల్‌(Railway Constable). కానీ మానసిక స్థితి సరిగా లేదో, లేక మతోన్మాదో తెలీదు కానీ.. తన చేతిలో ఉన్న మారణాయుధంతో ఓ ఉన్మాదిలా రెచ్చిపోయాడు.

రైల్లో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు

ఏఎస్‌ఐ సహా ముగ్గురు ప్రయాణికుల మృతి

జైపూర్‌-ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఘోరం

కాల్పుల అనంతరం రైలు నుంచి దూకి పరారీ

కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన జీఆర్‌పీ సిబ్బంది

ముంబై, జూలై 31: అతడో రైల్వే కానిస్టేబుల్‌(Railway Constable). కానీ మానసిక స్థితి సరిగా లేదో, లేక మతోన్మాదో తెలీదు కానీ.. తన చేతిలో ఉన్న మారణాయుధంతో ఓ ఉన్మాదిలా రెచ్చిపోయాడు. తన పై అధికారితో పాటు ముగ్గురు ప్రయాణికుల్ని(Three passengers) విచక్షణారహితంగా కాల్చిచంపాడు. జైపూర్‌ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు(Jaipur to Mumbai Express Train) లో రైల్వే రక్షణ బలగాల(ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌గా చేతన్‌ సింగ్‌ (Chetan Singh) విధులు నిర్వర్తిస్తున్నాడు.సోమవారం ఉదయం 5గంటల సమయంలో గుజరాత్‌(Gujarat)లోని వాపి స్టేషన్‌ సమీపంలో రైలు ఉండగా.. ఒక్కసారిగా తన ఇంచార్జి ఏఎ్‌సఐ టికా రామ్‌ మీనా(Tika Ram Meena)పై కాల్పులు జరిపిన చేతన్‌, అనంతరం వేరే బోగీలోకి వెళ్లి మరో ముగ్గురు ప్రయాణికులపైనా కాల్పులకు తెగబడ్డాడు.

బాధితులు నలుగురూ అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రయాణికులను అబ్దుల్‌ ఖాదిర్‌ భాయ్‌ మహమ్మద్‌ హుసేన్‌ భాన్‌పూర్‌వాలా(48), అఖ్తర్‌ అబ్బాస్‌ అలీ(48), సదర్‌ మహమ్మద్‌ హుసేన్‌లుగా అధికారులు గుర్తించారు. కాల్పుల అనంతరం ముంబై(Mumbai)లోని దహిసార్‌ రైల్వేస్టేషన్‌(Dahisar Railway Station) సమీపంలో గొలుసు లాగి రైలును ఆపి నిందితుడు పరారు కాగా.. అతడిని ముంబైలోని మీరా రోడ్డు వద్ద అధికారులు పట్టుకున్నారు. బోరివలి రైల్వే స్టేషన్‌(Borivali Railway Station)లో మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. చేతన్‌ సింగ్‌ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆర్‌పీఎ్‌ఫ(పశ్చిమ రైల్వే) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ప్రవీణ్‌ సిన్హా(Praveen Sinha) మీడియాకు తెలిపారు. ‘‘అతడికి సహనం చాలా తక్కువ. కేవలం ఆగ్రహంతోనే ఈ హత్యలు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. నిందితుడు చేతన్‌ ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హాథ్రస్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇదిలా ఉండగా, ప్రయాణికులను కాల్చిచంపిన అనంతరం చేతన్‌ సింగ్‌ వారి మృతదేహాల వద్ద హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మీరంతా పాకిస్థాన్‌ నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు. ఇక్కడిదంతా వారికి తెలుస్తోంది. మీరు హిందుస్థాన్‌లో ఉండాలంటే నేను చెబుతున్నాను వినండి, ఇక్కడ మోదీ, యోగి ఉన్నారు’’ అంటూ ఆ వీడియోలో వినిపిస్తోంది.

Updated Date - 2023-08-01T02:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising