ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు : రైల్వే మంత్రి

ABN, First Publish Date - 2023-06-03T09:44:11+05:30

ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాసోర్ : ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw) శనివారం చెప్పారు. సహాయక చర్యలపైనే తాము ముఖ్యంగా దృష్టి సారించామని, బాధితులకు వైద్య సహాయం అందించడమే తమ మొదటి కర్తవ్యమని చెప్పారు.

భారతీయ రైల్వేలు విడుదల చేసిన ప్రకటనలో, ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. సౌత్ ఈస్ట్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలో ఈ స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపింది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి, చురుగ్గా సహాయపడుతున్నందుకు ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలపైనే తాము ముఖ్యంగా దృష్టి సారించామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు. అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని, అదేవిధంగా రైల్వే భద్రతా కమిషనర్ స్వతంత్ర దర్యాప్తు చేస్తారని తెలిపారు. అంతకుముందు ఆయన ప్రమాదానికి గురైన రైలు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో అన్ని వైపులా నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు.

ఇది అత్యంత దారుణ, విషాదకర దుర్ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. బాధితులకు సాధ్యమైనంత అత్యుత్తమ వైద్య సేవలను అందజేస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారాన్ని శుక్రవారం ప్రకటించినట్లు తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయన్నారు. ప్రయాణికుల కోసం గాలింపు, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సుమారు 900 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ.2 లక్షలు చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు భారతీయ రైల్వేలు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ దారుణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి సహాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పశ్చిమ బెంగాల్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని బాలాసోర్‌కు బయల్దేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee) శనివారం సంఘటన స్థలానికి చేరుకుంటారని టీఎంసీ ఎంపీ డోలా సేన్ చెప్పారు. సహాయక చర్యల్లో పాలుపంచుకోవడం కోసం ఖరగ్‌పూర్ నుంచి అధికారులను ఆమె పంపించారని చెప్పారు.

ప్రమాదంలో చిక్కుకున్న మూడు రైళ్లు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహంగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని, ఆ తర్వాత షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడిందని, అంతేకాకుండా ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపై పడిందని తెలుస్తోంది. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

Updated Date - 2023-06-03T09:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising