ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Ministers Sworn: నేడు 18 నుంచి 20 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

ABN, Publish Date - Dec 30 , 2023 | 07:56 AM

నేడు రాజస్థాన్‌లో మంత్రి విస్తరణ జరగనుంది. సీఎం భజన్ లాల్ శర్మ మంత్రి వర్గంలోని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.

జైపూర్: నేడు రాజస్థాన్‌లో మంత్రి విస్తరణ జరగనుంది. సీఎం భజన్ లాల్ శర్మ మంత్రి వర్గంలోని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. పలు వర్గాల నుంచి వెలువడిన సమాచారం ప్రకారం మొత్తం 18 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రులుగా నియమితులైన వారి పేర్లను ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే మంత్రివర్గంలో అనుభవజ్ఞులు, కొత్త ముఖాలకు చోటు దక్కొచ్చని సమాచారం.


కాగా కేబినెట్ విస్తరణకు ముందు బీజేపీ కేంద్ర నాయకులతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకుగాను బీజేపీ 115 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మొదటి సారి భజన్ లాల్ శర్మను కాషాయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలకు అవకాశం కల్పించింది. ఐదో సారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన దేవ్‌నాని 16వ రాజస్థాన్ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కాగా జనవరి 19న గవర్నర్ ప్రసంగంతో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Updated Date - Dec 30 , 2023 | 07:56 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising