ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan: రాజ్‌పుత్ కర్ణి సేన హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు

ABN, First Publish Date - 2023-12-06T09:26:44+05:30

తమ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ వాతావరణం ఉంది.

జైపూర్: తమ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ వాతావరణం ఉంది. ఈ బంద్ బుధవారం మొత్తం కొనసాగనుంది. మరోవైపు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యపై రాజ్‌పుత్ కర్ణి సేన న్యాయ విచారణకు డిమాండ్ చేసింది. కాగా జైపూర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. సుఖ్‌దేవ్‌ను కలవాలన్న సాకుతో దుండగులు ఇంటిలోకి వెళ్లి అదను చూసి ఆయనను కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ముగ్గురు వ్యక్తులు సుఖ్‌దేవ్‌ను కలవాలంటూ శ్యామ్‌నగర్‌ ప్రాంతంలోని ఆయన ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడి ఆయనపై కాల్పులు జరిపారు. సుఖ్‌దేవ్‌ భద్రతా సిబ్బంది వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుఖ్‌దేవ్‌ మరణించగా ఆయన భద్రతాసిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. నిందితుల్లో ఒకరు మరణించగా మిగిలిన ఇద్దరు పరారయ్యారు. సుఖ్‌దేవ్‌ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడు రోహిత్‌ గోదారా ప్రకటించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T09:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising