‘రా’ చీఫ్‌గా రవి సిన్హా
ABN , First Publish Date - 2023-06-20T03:32:49+05:30 IST
రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత అధిపతి సామంత్ గోయల్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండగా... కేబినెట్
న్యూఢిల్లీ, జూన్ 19: రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత అధిపతి సామంత్ గోయల్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండగా... కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో 1988వ బ్యాచ్, ఛత్తీ్‌సగఢ్ క్యాడర్‌కు చెందిన రవి సిన్హాను రా తదుపరి అధిపతిగా నియమిస్తూ, సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. రెండు దశాబ్దాలుగా రాలో సేవలందిస్తున్న ఆయన... సంస్థలో ప్రస్తుతం రెండో అత్యున్నత హోదాలో కొనసాగుతున్నారు. అంతకుముందు ఆపరేషన్స్ వింగ్ బాధ్యతలు చేపట్టిన రవి సిన్హా.. పొరుగుదేశాలు, సాంకేతిక సంబంధిత ఆపరేషన్‌లలో మంచి పట్టున్న అధికారిగా గుర్తింపు పొందారు.