ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Robert Vadra: స్పృతి ఇరానీకి రాబర్ట్ వాద్రా స్ట్రాంగ్ కౌంటర్.. నా ఫోటో పక్కనపెట్టి, ఆ పని చూడు..

ABN, First Publish Date - 2023-08-12T22:30:34+05:30

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ‘అదానీ’ వ్యవహారం వాడీవేడీగా నడుస్తున్న విషయం తెలిసిందే! అదానీ ఆస్తులు అమాంతం పెరగడం, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‘అదానీ’ సంస్థలపై..

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ‘అదానీ’ వ్యవహారం వాడీవేడీగా నడుస్తున్న విషయం తెలిసిందే! అదానీ ఆస్తులు అమాంతం పెరగడం, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‘అదానీ’ సంస్థలపై షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో.. బీజేపీకి, అదానీకి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాలేంటని కాంగ్రెస్ కొంతకాలం నుంచి ప్రశ్నిస్తూ వస్తోంది. కానీ.. బీజేపీ మాత్రం మౌనం పాటిస్తోంది. అదానీ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతీసారి.. ఇతర టాపిక్‌లను తెరమీదకు తీసుకొస్తూ, ఆ మేటర్‌ని పక్కదారి పట్టిస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక కొత్త ఫోటోని తెరమీదకి తీసుకొచ్చారు. అప్పుడెప్పుడో అదానీతో రాబర్ట్ వాద్రా (ప్రియాంకా గాంధీ భర్త) కలిసి దిగిన ఫోటోని చూపిస్తూ.. దీనిపై సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ని ఆమె నిలదీశారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీకి ఇబ్బంది ఉంటే, మరి అదానీతో రాబర్ట్ వాద్రా ఎందుకున్నారని ప్రశ్నించారు.


ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు కానీ.. నేరుగా రాబర్ట్ వాద్రానే రంగంలోకి దిగారు. స్మృతి ఇరానీకి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు మణిపూర్‌ మండిపోతుంటే.. ఈ మంత్రి అనవసరంగా తన ప్రస్తావన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఓ సవాల్ కూడా విసిరారు. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన స్మృతి ఇరానీ.. ఈ విషయాన్ని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ వేదికగా తన పేరుని దుర్వినియోగం చేయడం మానుకోవాలని హితవు పలికారు. తన గురించి ఆలోచించడం తగ్గించాలని, తనపై విమర్శలు చేసి మీ అసమర్థతని కప్పిపుచ్చుకోలేరని చురకలంటించారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేయడంతో పాటు నెల రోజులకు పైగా నిరసనలు చేసిన మహిళా రెజ్లర్లను స్మృతి ఇరానీ ఎందుకు కలువలేదని ప్రశ్నించారు.

తనవైపు ఒక వేలు చూపిస్తే.. మిగతా వేళ్లు మీవైపే ఉన్నాయన్న సంగతిని గుర్తు పెట్టుకోండంటూ రాబర్ట్ వాద్రా కౌంటర్ వేశారు. మీ కుటుంబమే ఎన్నో వివాదాల్లో ఉందని విరుచుకుపడ్డారు. మీ గోవా రెస్టారెంట్, మీ డిగ్రీల గురించి దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మీ థర్డ్ పార్టీ పేర్ల గురించి కూడా దేశం తెలుసుకోవాలని అనుకుంటోందంటూ చురకలంటించారు. ఒకవేళ గోవా, మీ విద్యార్హతల గురించి చెప్పకపోతే.. మీరు వాస్తవాలు దాస్తున్నట్లు తేలినట్టేనని వాద్రా చెప్పారు. మరి, ఇందుకు స్మృతి ఇరానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Updated Date - 2023-08-12T22:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising