S Jaishankar : మన దేశంలో బయటి శక్తుల జోక్యం : జైశంకర్
ABN, First Publish Date - 2023-03-26T14:58:02+05:30
మన దేశంలోని కొందరు రాజకీయాలను విదేశాలకు తీసుకెళ్తున్నారని, బయటి శక్తులు మన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాయని
బెంగళూరు : మన దేశంలోని కొందరు రాజకీయాలను విదేశాలకు తీసుకెళ్తున్నారని, బయటి శక్తులు మన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) ఆరోపించారు. బెంగళూరులో భారతీయ జనతా యువ మోర్చా యువ సంవాద్‌లో ఆయన శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోని చాలా మందికి 2014 వరకు మన దేశంలోని విషయాలు చాలా సౌకర్యవంతంగా ఉండేవన్నారు. 2014లో ఈ పరిస్థితులు మారడంతో వారు విభిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని, విభిన్నమైన నమ్మకాలను చూస్తున్నారన్నారు. ఏదో తప్పు జరుగుతోందని వారు హఠాత్తుగా ఆరోపించడం ప్రారంభించారన్నారు. న్యాయస్థానాలు సక్రమంగా పని చేయడం లేదని, ఎన్నికల కమిషన్ సరిగా లేదని, పత్రికలపై ఆంక్షలు ఉన్నాయని ఆరోపించడం మొదలుపెట్టారన్నారు. 2014 తర్వాతే అన్నీ జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. ఎందుకు ఇలా జరుగుతోందని ప్రశ్నిస్తూ, భారత దేశంలోని కొందరు వ్యక్తుల పట్ల ఆసక్తిగలవారు భారత దేశానికి వెలుపల ఉన్నారన్నారు. దేశంలోని కొందరు వ్యక్తులు ఎన్నికల్లో విజయాలు సాధించలేకపోయినపుడు, వాస్తవిక భారత దేశానికి వారి ప్రాతినిధ్యం చాలా చాలా తక్కువగా ఉన్నపుడు భారత దేశం పక్కదోవపడుతోందని చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చరిత్రను చూసినా ఇటువంటివి సాధారణమేనని తెలుస్తుందన్నారు. వాటినే మీరు నేడు చూస్తున్నారన్నారు. దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాహుల్ గాంధీ లండన్‌లో మార్చి మొదటి వారంలో మాట్లాడుతూ, భారత దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థ, పార్లమెంటు వంటి వ్యవస్థల్లోకి ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చొరబడ్డాయన్నారు. ఆయన భారత దేశ అంతర్గత రాజకీయాల్లో విదేశీ సాయాన్ని కోరినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Hyper loop: చెన్నై-బెంగళూరు మధ్య హైపర్ లూప్?
Updated Date - 2023-03-26T15:55:18+05:30 IST