ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharad Pawar Vs Ajit Pawar : శరద్ పవార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ బాసట

ABN, First Publish Date - 2023-07-06T15:20:54+05:30

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు. రాజకీయాల్లో రిటైర్‌మెంట్ అనేది ఉండదని చెప్పారు. అజిత్ చెప్పారని శరద్ పవార్ రాజకీయాలను విరమించుకుంటారా? అని ప్రశ్నించారు. వృద్ధుడు రిటైర్ అవుతారా? అన్నారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో జూలై 2న చేరిన సంగతి తెలిసిందే. ఎన్‌సీపీని చీల్చిన అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన వర్గంలోని మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. తన వర్గం ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో అజిత్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శరద్‌ పవార్‌పై పదునైన విమర్శలు చేశారు. ''మీరు (శరద్ పవార్) నన్ను అందరిముందు విలన్‌గా చూపించారు. ఇప్పటికీ మీరంటే నాకు గౌరవం ఉంది. మీరే చెప్పండి...ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తున్నారు. రాజకీయాల్లో బీజేపీ నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవుతున్నారు. ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను ఉదాహరణగా తీసుకోండి. కొత్త తరం ఎదిగేందుకు అవకాశం ఇవ్వండి. మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. మీ వయస్సు 83 ఏళ్లు. ఇప్పటికైనా చాలించరా? మీరు మాకు ఆశీస్సులు ఇస్తే, మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తాం'' అని అజిత్ పవార్ అన్నారు.

ఎన్‌సీపీలోని తన మద్దతుదారులతో శరద్ పవార్ కూడా బుధవారం ముంబైలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన కుమార్తె, ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సూలే (Supriya sule) మాట్లాడుతూ, ''మమ్మల్ని అగౌరవపరుచు, కానీ మా నాన్నను కాదు'' అని అజిత్ పవార్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా మండిపడ్డారు. సీనియర్లు పని చేయడం మానేయాలని కొందరు అంటున్నారని, ఎందుకు మానేయాలని ఆమె ప్రశ్నించారు. పనిచేయడానికి వయసు అడ్డంకి కాదని చెబుతూ, రతన్ టాటాకు 86 ఏళ్లు, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్న సైరస్ పూనావాలా వయస్సు 84 ఏళ్లు, అమితాబ్‌ బచ్చన్‌కు 82 సంవత్సరాలు అని గుర్తుచేశారు. వారెన్ బఫెట్, ఫరూక్ అబ్దుల్లా పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు.

ఎన్‌సీపీని శరద్ పవార్ 1999లో స్థాపించారు. ఈ పార్టీని ఆయన సమీప బంధువు అజిత్ పవార్ చీల్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ మట్టికొట్టుకుపోయాయని శరద్ పవార్ ఆయనకు గుర్తు చేశారు. ఇదిలావుండగా, తనదే అసలైన ఎన్‌సీపీ అని ప్రకటించాలని అజిత్ పవార్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..

Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్

Updated Date - 2023-07-06T15:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising