ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Assembly Elections: ఊహించని పరిణామం.. కలకలం రేపుతోన్న పవార్ నిర్ణయం

ABN, First Publish Date - 2023-04-14T19:26:16+05:30

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ఊహించని పరిణామం జరిగింది.

Sharad Pawar gives fresh shock to congress Party
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ఊహించని పరిణామం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 45 చోట్ల పోటీ చేయాలని ఎన్సీపీ (Nationalist Congress Party) నిర్ణయించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని ఢిల్లీలో కలుసుకున్న 24 గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది.

కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ-కాంగ్రెస్-జేడియూ (BJP-Congress-JDU) మధ్య త్రికోణ పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఎన్సీపీ ఎంట్రీ ఇస్తోంది.

ఇటీవలే జాతీయ హోదా కోల్పోవడంతో హోదా తిరిగి పొందేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోంది ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరాఠీ ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఎన్సీపీ పోటీ చేయాలని అనుకుంటోంది. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్సీపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ ద్వారా వెల్లడిస్తున్న తరుణంలో ఎన్సీపీ నిర్ణయం హస్తం పార్టీ పెద్దలకు షాకింగ్ పరిణామమని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఎన్సీపీ ఓట్లు చీలిస్తే బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు.

వాస్తవానికి బుధవారం జరిగిన ఖర్గే-నితీశ్‌ భేటీలో ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే తనకు వేరే పని ఉండడంతో రాలేకపోయానని ఆయన తెలిపారు. శుక్రవారం విపక్ష నేతలతో భేటీ అవుతానని చెప్పిన ఆయన.. గురువారం రాత్రే ఢిల్లీ చేరుకుని ఖర్గే, రాహుల్‌తో మంతనాలు జరిపారు. విపక్షాల ఐక్యతపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

అదానీ వ్యవహారంలో జేపీసీ దర్యాప్తు డిమాండ్‌ను తప్పుబట్టి.. ప్రతిపక్షాలపై ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ పెద్ద బాంబే పేల్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి సుముఖంగా ఉన్న ఆయనే.. అదానీని గట్టిగా వెనకేసుకురావడంతో విపక్షాలు నీరసపడ్డాయి. ఐక్యతా యత్నాలు మళ్లీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని కాంగ్రెస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నితీశ్‌‌ను ముందుకు తెచ్చారు.

ఖర్గేను కలిసిన 24 గంటల్లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని పవార్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ షాక్ నుంచి తేరుకోలేకపోతోంది.

Rahul Gandhi: అంబేద్కర్ జయంతి రోజే ఢిల్లీ నివాసం ఖాళీ చేస్తున్న రాహుల్

Yogi Adityanath: ఆరేళ్లలో 183 ఎన్‌కౌంటర్లు.. మాఫియా డాన్‌ల పాలిట సింహస్వప్నం



Updated Date - 2023-04-14T19:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising