ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawar Play : అంతుబట్టని శరద్ పవార్ వ్యూహాలు.. కలకలం రేపుతున్న తాజా వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-08-25T12:34:06+05:30

మరాఠా రాజకీయ దిగ్గజం, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మాటల్లో అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆయన ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో తెలియడం లేదు. తన సమీప బంధువు అజిత్ పవార్ పార్టీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ, తన పార్టీలో చీలిక లేదని చెప్తున్నారు.

ముంబై : మరాఠా రాజకీయ దిగ్గజం, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) మాటల్లో అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆయన ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో తెలియడం లేదు. తన సమీప బంధువు అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపి, ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ, తన పార్టీలో చీలిక లేదని, ఏకతాటిపై ఉందని చెప్తున్నారు.

అజిత్ పవార్ (63) ఎన్‌సీపీని చీల్చి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెలలవుతోంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ (82) శుక్రవారం మాట్లాడుతూ, ఎన్‌సీపీ చీలిపోలేదని, కొందరు నేతలు వేరొక రాజకీయ వైఖరిని అవలంబించి పార్టీని వదిలిపెట్టినప్పటికీ, ఇది చీలిక కాదని చెప్పారు. పార్టీలో అత్యధికులు బయటకు వెళ్లిపోలేదని, కొందరు విభిన్న వైఖరిని అనుసరించారని, ప్రజాస్వామ్యం వారికి ఆ అవకాశం ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికీ అజిత్ పవార్ తమ పార్టీ నేత అని చెప్పారు.

శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియ సూలే మాట్లాడుతూ, ఎన్‌సీపీ ఐకమత్యంగా ఉందన్నారు. బీజేపీతో ఏ రూపంలోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అని, తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్ అని చెప్పారు. తమ పార్టీలో కొందరు వేరొక వైఖరిని అవలంబించారని, అందువల్ల తాము శాసన సభ సభాపతికి తమ అభిప్రాయాలను తెలిపామని చెప్పారు. అజిత్ పవార్ వైఖరి పార్టీకి వ్యతిరేకంగా ఉందని, సభాపతి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.


శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా (I.N.D.I.A) కూటమిలో ఉంది. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్‌ను కూడా ఆయన కలుస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో ఆయన కూడా పాల్గొంటున్నారు. ఇటీవల అజిత్ పవార్ పేరు ప్రస్తావించకుండా ఎన్‌సీపీ చీలిక వర్గాన్ని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడి పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. అజిత్ పవార్‌ను ఆశీర్వదించాలని శరద్ పవార్‌ను కోరుతూ మహారాష్ట్రలోని బీడ్‌లో ఇటీవల పోస్టర్లు వెలిశాయి. శరద్, అజిత్ ఆగస్టు 12న ఓ వ్యాపారవేత్త నివాసంలో రహస్యంగా సమావేశమయ్యారు. దీనిపై కాంగ్రెస్, శివసేన-యూబీటీ ఘాటుగా స్పందించాయి.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె నుంచి దించడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమి ఇండియా తదుపరి సమావేశాలు ఈ నెల 31, వచ్చే నెల 1 తేదీల్లో ముంబైలో జరుగుతాయి. ఈ కూటమిలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా ఉంది. ఈ పరిస్థితులను పరిశీలించినపుడు శరద్ పవార్ వ్యూహాలు అంతుబట్టడం లేదు.


ఇవి కూడా చదవండి :

Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..

PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

Updated Date - 2023-08-25T12:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising