ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Opposition Unity : రాహుల్, ఖర్గేలతో శరద్ పవార్ భేటీ త్వరలో!

ABN, First Publish Date - 2023-04-13T19:55:21+05:30

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్య పోరాటానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్

Sharad Pawar, Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్య పోరాటానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) నడుం బిగించారు. ఆయన గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)తో సమావేశమవుతారని జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొంటారని సమాచారం.

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar), బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) బుధవారం ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీలతో మాట్లాడిన సంగతి తెలిసిందే. భావ సారూప్యతగల ప్రతిపక్ష పార్టీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలనే లక్ష్యంతో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, అదానీ గ్రూప్ విషయంలో ప్రతిపక్షాల వైఖరికి భిన్నంగా శరద్ పవార్ ఇటీవల మాట్లాడారు. కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అదానీ గ్రూప్‌ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తుండగా, ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించిందని, జేపీసీ కన్నా, ఈ కమిటీ చేత దర్యాప్తు చేయించడమే మంచిదని శరద్ అన్నారు. అదానీ అంశం ప్రజా సమస్య కాదని, అదానీ (Adani) చేసిన మేలును కూడా గుర్తించాలని అన్నారు. దీంతో ఆయన బీజేపీవైపు చూస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి :

Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ

Siachen Day: సియాచిన్ డే.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం ఘన విజయానికి గుర్తు..

Updated Date - 2023-04-13T19:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising