ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jaishankar and Shashi Tharoor : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై శశి థరూర్ వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-07-01T10:22:30+05:30

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)‌ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.

S Jaishankar, Shashi Tharoor
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)‌ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు. ఈ సంఘటన జరిగినపుడు ‘శాంతించండి’ అని జైశంకర్‌కు తాను ఇచ్చిన సలహాను తప్పుగా అర్థం చేసుకున్నారని, తప్పుడు భావం ప్రచారమైందని తనకు తెలిసిందన్నారు.

యూజువల్ ట్రోల్స్ నుంచి చక్కర్లు కొడుతున్న ఓ మెసేజ్‌ని తనకు తన మిత్రులు ఫార్వర్డ్ చేశారని శశి థరూర్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు. లండన్‌లోని ఇండియన్ ఎంబసీ వద్దగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించిన సంఘటనకు జైశంకర్ స్పందనపై తాను ‘శాంతించండి’ అని ఆయనకు సలహా ఇచ్చినట్లు ట్రోలింగ్ జరుగుతున్నట్లు చెప్పారని తెలిపారు. అయితే తన ఉద్దేశం అది కాదన్నారు. ఈ సంఘటన జరిగినపుడు జైశంకర్ కన్నా ముందుగా తానే స్పందించానని చెప్పారు. ఈ సంఘటన జరిగిన వెంటనే లోక్‌సభ వద్ద (మీడియా) కెమెరాలు ఉండటంతో తాను వెంటనే స్పందించానన్నారు. ఆగ్రహం వ్యక్తం చేయడం కచ్చితంగా చాలా సరైన స్పందన అని స్పష్టం చేశారు. రెచ్చగొట్టకుండా విదేశాల కంట్లో వేళ్లు పెట్టడం మన వ్యవహార శైలి కాదన్నారు. జాతీయ జెండాను అవమానించడం రెచ్చగొట్టడమేనని, భారత దేశ స్పందన కచ్చితంగా తగిన రీతిలో ఉందని తెలిపారు. మన విదేశాంగ విధానం పార్టీ విభేదాలకు అతీతంగా, పరస్పర సమ్మతిగల విధానంగా కొనసాగిద్దామన్నారు. మనమంతా భారతీయులమని, ఇటువంటి విషయాలన్నీ మన దేశ ప్రయోజనాలు కావాలన్నారు.

జైశంకర్ ఏమన్నారు?

కర్ణాటక శాసన సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్‌లో సుబ్రహ్మణ్యం జైశంకర్ బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఇతర దేశాలపై వ్యాఖ్యలు చేసే దురలవాటు పాశ్చాత్య దేశాలకు ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమకు దేవుడిచ్చిన హక్కు అని పాశ్చాత్య దేశాలు భావిస్తాయన్నారు. అందుకే ఆ దేశాలు భారత దేశంపై వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు.

ఈ వ్యాఖ్యలపై శశి థరూర్ అప్పట్లో స్పందిస్తూ, తనకు జైశంకర్‌ను చాలా కాలం నుంచి తెలుసునని, ఆయనను స్నేహితునిగా భావిస్తానని చెప్పారు. అయితే ఈ విషయంలో మాత్రం మనం విమర్శలపట్ల అతి సున్నితంగా మారిపోకూడదని, త్వరగా రెచ్చిపోయేలా ఉండకూడదని అన్నారు. ఓ ప్రభుత్వంగా మనం కాస్త గంభీరంగా అడుగులు వేయడం ముఖ్యమని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

‘ఆర్డినెన్స్‌’పై సుప్రీంకు ఆప్‌

Maharashtra : మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి..

Updated Date - 2023-07-01T10:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising