Modi Wave : మోదీ ప్రభంజనం ముగిసింది.. ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోంది.. : సంజయ్ రౌత్
ABN, First Publish Date - 2023-05-14T13:52:49+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రభంజనం ముగిసిందని, ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోందని శివసేన (యూబీటీ)
ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రభంజనం ముగిసిందని, ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోందని శివసేన (యూబీటీ) (Shiv Sena -UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) చెప్పారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ రౌత్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మోదీ ప్రభంజనం ముగిసిందన్నారు. ప్రతిపక్షాల ప్రభంజనం దేశవ్యాప్తంగా వీస్తోందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తమ సన్నాహాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం సమావేశమవుతున్నామని చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నామని తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ ఓటమినిబట్టి నియంతృత్వాన్ని ప్రజలు ఓడించగలరని స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్ గెలిచిందంటే, బజరంగ్ బలి ఆ పార్టీకి మద్దతుగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. బజరంగ్ బలి బీజేపీకి అండగా లేనట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ ఓడిపోతే అల్లర్లు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారని గుర్తు చేశారు. కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందన్నారు. అల్లర్లు ఎక్కడ జరిగాయని ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉండేది. 2024 ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఈ శాసన సభ ఎన్నికలకు ప్రాధాన్యం పెరిగింది. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ కర్ణాటక ప్రజలు స్థానిక సమస్యలకే పెద్ద పీట వేసి, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించారు.
ఇదిలావుండగా, ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పలువురు నేతలతో సమావేశమవుతున్నారు. ఆయన ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే వంటివారిని కలిశారు.
ఇవి కూడా చదవండి :
Karnataka Election Results : అతి తక్కువ ఓట్లతో గెలుపు.. అవాక్కయిన ప్రత్యర్థులు..
Maharashtra : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. పలువురు పోలీసులకు గాయాలు..
Updated Date - 2023-05-14T13:52:49+05:30 IST