ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi : రాహుల్‌పై అనర్హత వేటుతో ఆసక్తికర పరిణామాలు..

ABN, First Publish Date - 2023-03-27T10:01:25+05:30

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వ్యవహారంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఈ వ్యవహారం ఒక్కతాటి మీదకు తీసుకొస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Delhi : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వ్యవహారంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఈ వ్యవహారం ఒక్కతాటి మీదకు తీసుకొస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి దూరంగా ఉంటూ వస్తున్న పార్టీలు సైతం ఇప్పుడు కలిసి వస్తున్నాయి. నేటి ప్రతిపక్షాల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సైతం హాజరుకానుండటం గమనార్హం. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల సమావేశాలకు టీఎంసీ దూరంగా ఉంటూ వస్తోంది. నేటి సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు జవహర్ సర్కార్, ప్రసూన్ బెనర్జీ హాజరుకానున్నారు.

పార్లమెంటు (Parliament)లో నేడు ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) చాంబర్‌లో భేటీ కానున్నారు. అనంతరంఉభయ సభల కాంగ్రెస్ ఎంపీలు భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత చాంబర్‌లో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీల వాయిదా తీర్మానాలు ఉండనున్నాయి. అదానీ అంశంపై జేపీసీ డిమాండ్ చేస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ (Ranjith Ranjan) వాయిదా తీర్మానం చేయనున్నారు. . ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మరో వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం టాగోర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - 2023-03-27T10:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising