Share News

Speaker: అసెంబ్లీ స్పీకర్‌ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లు

ABN , First Publish Date - 2023-11-04T09:27:57+05:30 IST

రాష్ట్రప్రభుత్వాలకు గవర్నర్లు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు(Assembly Speaker Appau) వ్యాఖ్యానించారు.

Speaker: అసెంబ్లీ స్పీకర్‌ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లు

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రప్రభుత్వాలకు గవర్నర్లు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు(Assembly Speaker Appau) వ్యాఖ్యానించారు. తిరునల్వేలి జిల్లా కొడుముడియార్‌ డ్యాం నుంచి వ్యవసాయ భూములకు శుక్రవారం సాగునీటిని ఆయన విడుదల చేశారు. ఈ నీరు వల్లియూరాన్‌, పడలియార్‌ , నంబియారు కాలువల మీదుగా 2024 మార్చి 31వ తేది వరకు వ్యవసాయ భూములకు చేరుతుందని స్పీకర్‌ అప్పావు తెలిపారు. ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు నాంగునేరి, వల్లియూర్‌ మండలాల్లో ఉన్న 44 చెరువులు, 5,781 ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల గవర్నర్లు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీ, మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించే బిల్లులను పరిశీలించకుండా అటకెక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కార్తికేయన్‌, ప్రజాపనుల శాఖ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-04T09:27:58+05:30 IST