ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై ఎస్‌ఐ అత్యాచారం

ABN, First Publish Date - 2023-11-11T10:52:18+05:30

రాజస్థాన్‌లో దౌసా జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) అత్యాచారానికి పాల్పడ్డాడు. దౌసా జిల్లాలోని లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది.

రాజస్థాన్‌లో దౌసా జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) అత్యాచారానికి పాల్పడ్డాడు. దౌసా జిల్లాలోని లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. నిందితుడు భూపేంద్రసింగ్ మైనర్ బాలికను మధ్యాహ్నం సమయంలో తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా తెలిపారు. నిందితుడు భూపేంద్రసింగ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు రహువాస్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందే నిందితుడు భూపేంద్రసింగ్‌ను స్థానికులు చితకబాదారు.


భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ కిరోడి లాల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అసమర్థత పాలన కారణంగా పోలీసులు నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వంటి సున్నితమైన సమయంలో కూడా పోలీసులు అఘాయిత్యాలకు పాల్పడడం మానుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ లాల్సోట్‌లో దళిత బాలికపై ఎస్‌ఐ అత్యాచారం చేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమాయక చిన్నారికి న్యాయం చేసేందుకు నేను సంఘటనా స్థలానికి చేరుకున్నాను. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అసమర్థత కారణంగా పోలీసులు నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలు వంటి సున్నితమైన సందర్భంలో కూడా అఘాయిత్యాలకు పాల్పడడం మానుకోవడం లేదు. నిందితుడు భూపేంద్ర సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలి. బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులందరికీ అన్ని విధాలుగా సహాయం చేయాలి.’’ అని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-11T10:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising