ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CBI Vs DK Shiva Kumar : డీకే శివ కుమార్‌కు భారీ ఊరట

ABN, First Publish Date - 2023-05-17T16:21:26+05:30

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌కు సుప్రీంకోర్టులో కాస్త ఊరట దక్కింది. అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను సవాల్ చేస్తూ

DK Shiv Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌కు సుప్రీంకోర్టులో కాస్త ఊరట దక్కింది. అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను అత్యున్నత న్యాయస్థానం జూలై 14కు వాయిదా వేసింది. ఈ అంశం మే 23న హైకోర్టు విచారణకు వస్తోందని శివ కుమార్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టు దృష్టికి తేవడంతో జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆదాయపు పన్ను శాఖ 2017లో డీకే శివ కుమార్ ఆస్తులపై సోదాలు నిర్వహించింది. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఆయనపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆయనపై దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. 2019 సెప్టెంబరు 25న ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీబీఐ 2020 అక్టోబరు 3న అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసింది.

తనపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని శివ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు పదే పదే నోటీసులు జారీ చేస్తూ, తనను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోందని ఆరోపించారు. దీంతో హైకోర్టు సీబీఐ దర్యాప్తును నిలిపేసింది. ఈ నిలిపివేత ఆదేశాలను చాలాసార్లు పొడిగించింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం తనపై సీబీఐ దర్యాప్తు జరపడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇది చాలా తీవ్రమైన కేసు అని, అందువల్ల దర్యాప్తును సుదీర్ఘ కాలం నిలిపేయకూడదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. దర్యాప్తును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, తదుపరి విచారణ జూలై 14న జరుగుతుందని తెలిపింది.

ఏమిటి ఈ కేసు?

కర్ణాటకలో 2013-18 కాలంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో డీకే శివ కుమార్ ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు సీబీఐ ఆరోపించింది. 2020 అక్టోబరు 3న ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. శివ కుమార్, ఆయన కుటుంబ సభ్యులకు 2013 ఏప్రిల్ నాటికి రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉండేవని, 2018నాటికి వీరి ఆస్తుల విలువ రూ.162.53 కోట్లకు పెరిగిందని తెలిపింది. అంటే ఐదేళ్ళలో ఐదు రెట్ల మేరకు ఆస్తులు పెరిగినట్లు తెలిపింది.

ముఖ్యమంత్రి పదవిపై ఆశలకు అడ్డుపడుతున్న కేసులు?

మే 10న జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తనకే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని శివ కుమార్ గట్టిగా పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆయన పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలతో వీరిరువురూ చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా బుధవారం మీడియాకు చెప్పారు. పన్ను ఎగవేతకు పాల్పడినట్లు శివ కుమార్‌పై ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ ఆయనపై నమోదు చేసిన కేసులు ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడుతున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆయనపై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

Gujarat CM : గుజరాత్ ముఖ్యమంత్రి నిరాడంబరత.. ఇలాంటి నేత కదా కావాలి..

India Vs EU : రష్యన్ చమురు రీసెల్లింగ్.. యూరోపియన్ దౌత్యవేత్తకు ఘాటు జవాబిచ్చిన జైశంకర్..

Updated Date - 2023-05-17T16:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising