ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TMC : మమత బెనర్జీకి షాక్ ఇచ్చిన టీఎంసీ ఎంపీ పెలీరో

ABN, First Publish Date - 2023-04-11T18:37:57+05:30

గోవా మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ నేత లుయిజిన్హో ఫెలీరో మంగళవారం ఆ పార్టీ (TMC)కి రాజీనామా చేశారు. అంతేకాకుండా తన

TMC leader Luizinho Faleiro
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : గోవా మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ నేత లుయిజిన్హో ఫెలీరో మంగళవారం ఆ పార్టీ (TMC)కి రాజీనామా చేశారు. అంతేకాకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు. అయితే తాను ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన మీడియాకు చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) ఆహ్వానం మేరకు తాను ఆ పార్టీలో చేరానని ఫెలీరో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చెప్పారు. తృణమూల్ అనే పదానికి తగినట్లుగా క్షేత్ర స్థాయి రాజకీయాలు నూతనత్వాన్ని సంతరించుకుంటాయని ఆశించి తాను ఆ పార్టీలో చేరానని తెలిపారు. మమత నేతృత్వంలో గోవా కొత్త తరహా క్షేత్ర స్థాయి రాజకీయాలను చూస్తుందని భావించానన్నారు. అయితే అనుకున్నట్లుగా ఏమీ జరగలేదని, అందువల్ల తాను తన రాజ్యసభ సభ్యత్వానికి, టీఎంసీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. సదుద్దేశాలు ఉన్నప్పటికీ, ప్రణాళిక ప్రకారం ఏదీ జరగలేదని చెప్పారు. పార్టీలో తనకు ముఖ్యమైన పదవులను ఇచ్చినందుకు మమత బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు.

టీఎంసీ స్పందన

ఫెలీరో రాజీనామాపై టీఎంసీ స్పందిస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. గోవా ప్రజలకు ఆయన నిరంతరం సేవలందించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నికలు జరిగినపుడు మరొక అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది.

అసలు కారణం!

2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్‌పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించారని చెప్తున్నాయి. గోవాలో పార్టీ వ్యవహారాల నుంచి ఆయనను తప్పించడంతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా, ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పార్టీకే చెందిన అర్పిత ఘోష్ చేత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించారు. అనంతరం 2021లో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. వాస్తవానికి అర్పిత ఘోష్ రాజసభ సభ్యత్వం పదవీ కాలం 2026 వరకు ఉంది. కానీ ఆయన కోసం అర్థాంతరంగా అర్పిత చేత రాజీనామా చేయించారు.

ఇవి కూడా చదవండి :

Arvind Kejriwal : జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్

BJP Vs Congress : సోనియా గాంధీ వ్యాసంపై బీజేపీ ఆగ్రహం

Updated Date - 2023-04-11T18:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising