Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు
ABN, First Publish Date - 2023-04-01T14:22:02+05:30
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై బీజేపీ, టీఎంసీ నేతల
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై బీజేపీ, టీఎంసీ నేతల పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ (BJP) చేస్తున్న ఆరోపణలను టీఎంసీ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆరోపణలు 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగుతాయని దుయ్యబట్టారు.
మహువా మొయిత్రా శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ శ్రీరామ నవమి సందర్భంగా ప్రారంభించిన ఆరోపణల పరంపర 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగుతుందన్నారు. పాకిస్థాన్ దాడులు, విదేశీ శక్తులు భారత దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం వంటి చెత్త ఈసారి నెమ్మదిగా ఉందన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే కట్టుదిట్టమైన అంశం హిందూ కార్డ్ అన్నారు. ‘‘జై కాళీ మాత, బుద్ధిని ప్రసాదించు తల్లీ. నా దేశాన్ని కాపాడు’’ అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా, కాజీపర ప్రాంతంలో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయన్నారు. దుకాణాలు, మార్కెట్లు, రవాణా సదుపాయాలు శనివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపేశారు.
ఘర్షణల్లో అనేక దుకాణాలు, ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలపై సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.
ఇవి కూడా చదవండి :
Jayamangala VenkataRamana: అమరావతి రైతులు ముందు నోరుజారిన వైసీపీ ఎమ్మెల్సీ..!
Corona mask: ఆ ప్రదేశాల్లో మాస్కు ధారణ తప్పనిసరి
Updated Date - 2023-04-01T14:22:02+05:30 IST