Toll gate fee: రేపటి నుంచి టోల్ గేట్లలో రుసుము పెంపు
ABN , First Publish Date - 2023-03-31T11:01:25+05:30 IST
ఈసీఆర్ టోల్ గేట్లలో రుసుము పెంపు శనివారం నుంచి అమలుకు రానుంది. చెన్నై-పుదుచ్చేరి(Chennai-Puducherry) హైవేలో

ఐసిఎఫ్(చెన్నై): ఈసీఆర్ టోల్ గేట్లలో రుసుము పెంపు శనివారం నుంచి అమలుకు రానుంది. చెన్నై-పుదుచ్చేరి(Chennai-Puducherry) హైవేలో అక్కరై-పుదుచ్చేరి, అక్కరై-మహాబలిపురం, మహాబలిపురం- గూనిమేడు, ఉద్దండి, మహాబలిపురం, అనుమందై తదితర ప్రాంతాల్లో టోల్ గేట్‌లున్నాయి. చెన్నై-మహాబలిపురం మధ్య పర్యాటక రవాణా పెంచేలా 2018లో అక్కరై-మహాబలిపురం మధ్య ఫోర్ వే అభివృద్ధి చేశారు. మహాబలిపురం-పుదుచ్చేరి(Mahabalipuram-Puducherry) మధ్య విస్తరణ పనులు జరుగుతున్నాయి. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ప్రాంతంలో టోల్ గేట్‌ల వద్ద టోల్ రుసుము వసూళ్లు నిలిపివేశారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ రుసుము అమల్లోకి వచ్చి 2024 మార్చి నెలాఖరు వరకు కొనసాగనుంది. ఆ ప్రకారం, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు ఒకసారికి రూ.47, ఒకేరోజు వెళ్లి తిరిగొచ్చేందుకు రూ.70, పలుమార్లు వెళ్లేందుకు రూ.128 (ఒక రోజు), మూడు నెలలకు రూ.1,550 (50 సార్లు), మాసాంతపు రుసుము రూ.2,721, చిన్నరకం గూడ్సు వాహనాలు, మినీ బస్సులకు ఒకసారికి రూ.75, ఒకరోజు వెళ్లి తిరిగొచ్చేందుకు రూ.113, పలుమార్లు ప్రయాణానికి రూ.207 (ఒక రోజు), మూడు నెలలు రూ.2,504 (50 సార్లు), మాసాంతపు రుసుము రూ.4,395గా నిర్ణయించారు. బస్సులు, లారీలకు ఒకసారి రూ.157, ఒకరోజు వెళ్లి తిరిగొచ్చేందుకు రూ.236, పలుమార్లు ప్రయాణానికి రూ.433, మూడు నెలలకు రూ.5,247 (50 సార్లు), మాసాంతపు రుసుము రూ.9,208, కంటైనర్ లారీలకు ఒకసారికి రూ.301, వెళ్లి వచ్చేందుకు రూ.451, పలుమార్లు ప్రయాణానికి రూ.826 (ఒక రోజు), మూడు నెలలకు రూ.10,017 (50 సార్లు), మాసాంతపు రుసుము రూ.17,580 వసూలుచేయనున్నారు. అలాగే, స్థానిక వాహనాలు, కారు, జీబు, ద్విచక్రవాహనాలకు రూ.240, జేసీబీ, క్రేన్‌లు, వాణిజ్య వాహనాలకు రూ.300, స్కూల్ బస్సులకు రూ.1,900, ట్రక్కులు, కంటైనర్‌లకు రూ.950 వసూలుచేయనున్నారు.