ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Accident: మరోసారి ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి, 80 మందికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2023-10-12T09:04:55+05:30

దేశంలో రోజు రోజుకు రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ప్రమాదం మరిచిపోయే లోపే మరో ప్రమాదం సంభవిస్తుంది. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.

పాట్నా: దేశంలో రోజు రోజుకు రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ప్రమాదం మరిచిపోయే లోపే మరో ప్రమాదం సంభవిస్తుంది. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం నలుగురు మరణించారు. 80 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రమాదంలో 21 బోగీలు పట్టాలు తప్పాయి. బక్సర్ సమీపంలోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు దగ్గరలో రాత్రి 9.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి బయలుదేరిన రైలు అస్సాంలోని గౌహతి సమీపంలోని కామాఖ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను విపత్తు నిర్వహణ శాఖ, ఆరోగ్య శాఖ, బక్సర్, భోజ్‌పూర్ జిల్లా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. రఘునాథ్‌పూర్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటనను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కార్యాలయం పేర్కొంది. బక్సర్‌లోని జిల్లా అధికారులతో, ఇతర ఏజెన్సీలతో తాము టచ్‌లో ఉన్నామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇక రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది.

హెల్ప్‌లైన్ నంబర్లు:

పాట్నా: 9771449971, ధన్‌పూర్: 8905697493, కమాండ్ కంట్రోల్: 7759070004, అరా: 8306182542, న్యూఢిల్లీ -01123341074, 9717631960 , ఆనంద్ విహార్ టెర్మినల్- 9717632791, కమర్షియల్ కంట్రోల్ ఢిల్లీ డివిజన్ - 9717633779

Updated Date - 2023-10-12T09:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising