Share News

Saifuddin Laskar: తృణమూల్ కాంగ్రెస్ నేత హత్య.. అడ్డంగా దొరికిన అనుమానితుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

ABN , First Publish Date - 2023-11-13T14:46:51+05:30 IST

TMC Leader Case: ఆరోపణలు, విమర్శల వరకు ఆగిపోవాల్సిన రాజకీయాలు ఇప్పుడు వ్యక్తిగత దాడులకు దారితీస్తున్నాయి. అంతర్గత విభేదాల కారణంగానో లేక ప్రత్యర్థుల అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనో.. ఆయా నేతలపై దాడులు చేయించడం లేక హత్యలు చేయించడం వంటి భయంకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Saifuddin Laskar: తృణమూల్ కాంగ్రెస్ నేత హత్య.. అడ్డంగా దొరికిన అనుమానితుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Kolkata: ఆరోపణలు, విమర్శల వరకు ఆగిపోవాల్సిన రాజకీయాలు ఇప్పుడు వ్యక్తిగత దాడులకు దారితీస్తున్నాయి. అంతర్గత విభేదాల కారణంగానో లేక ప్రత్యర్థుల అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనో.. ఆయా నేతలపై దాడులు చేయించడం లేక హత్యలు చేయించడం వంటి భయంకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగాల్‌లో అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఓ దుండగుడు తృణమూల్ కాంగ్రెస్ లీడర్ సైఫుద్దిన్ లస్కర్‌ను కాల్చి చంపాడు. ఆ వెంటనే అనుమానుతుడ్ని పట్టుకొని, మద్దతుదారులు అతడ్ని కొట్టి చంపారు. ఈ ఘటన ‘24 పర్గనాస్’ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.


సైఫుద్దిన్ లస్కర్ జాయ్‌నగర్‌లోని బముంగాచి ప్రాంతంలో తృణమూల్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన భార్య భార్య పంచాయితీ ప్రధాన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉదయం లస్కర్ ఓ పని నిమిత్తం ఇంటి బయటకు రాగా.. అప్పటికే ఇంటి బయట కాపుకాచుకొని కూర్చున్న నిందితుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు నేరుగా శరీరంలోకి దూసుకెళ్లిపోవడంతో.. లస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాసేపట్లోనే అక్కడికి చేరుకున్న లస్కర్ మద్దతుదారులు.. ఓ అనుమానుతుడ్ని పట్టుకున్నారు. ఈ హత్యలో అతని ప్రమేయం ఉందని భావించి.. అతడ్ని చితకబాదారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తర్వాత అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎం పార్టీలు పరస్పర విమర్శలకు దిగాయి.

లస్కర్ హత్య వెనుక కచ్ఛితంగా రాజకీయ కోణం ఉందని, ఇది సీపీఎం పనేనని తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్నాయని, దాని పలితమే ఈ హత్యకు దారి తీసిందని పేర్కొన్నారు. సీపీఎంను నిందించి ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన.. పోలీసులు సరైన విచారణ జరిపి, కుట్రను ఛేదించాలని చక్రవర్తి డిమాండ్ చేశారు. మరోవైపు.. ఓ అనుమానుతుడ్ని తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-13T14:46:53+05:30 IST