ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uddhav Thackeray: 2024లో బీజేపీ-శిండే వర్గాన్ని చిత్తుగా ఓడించాలన్న ఉద్ధవ్

ABN, First Publish Date - 2023-03-05T22:23:34+05:30

బాల్ థాకరే పేరు వాడుకోకుండా మోదీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ఉద్ధవ్ సవాలు విసిరారు.

Uddhav Thackeray criticises BJP
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గాన్ని నిజమైన శివసేన(Shiv Sena)గా గుర్తించి 'విల్లు-బాణం' గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్ణయం తీసుకోవడంపై ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) మరోసారి స్పందించారు. తమ పార్టీ గుర్తును శిండే వర్గం లాక్కుందన్నారు. తన గుర్తును దొంగతనం చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కేంద్రానికి బానిసలా వ్యవహరిస్తోందని చెప్పారు. తనకు ఇచ్చిన కాగడా గుర్తుతోనే ఎన్నికల్లో పోటీచేస్తానని రత్నగిరిలో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. రానున్న 2024 ఎన్నికల్లో బీజేపీ-శిండే వర్గానికి ఓట్లు వేయరాదని ఉద్ధవ్ సూచించారు. 2024లో బీజేపీ-శిండే వర్గాన్ని చిత్తుగా ఓడించాలన్నారు. తన తండ్రి అయిన బాల్ థాకరే పేరు వాడుకోకుండా మోదీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ఉద్ధవ్ సవాలు విసిరారు.

ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించింది. అంతేకాదు.. 1966లో శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ కూడా శిందే వర్గానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాలు విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ(ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా శిండే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ తర్వాత.. ఉద్ధవ్‌, శిండే వర్గాల మధ్య శివసేన పేరు, పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే పేరును వాడుకోవడం, పార్టీ గుర్తు విషయంలో ఆదిపత్య పోరు మొదలైంది. ఆర్నెల్ల క్రితం తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని, పార్టీ గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరుతూ ఉద్ధవ్‌ ఠాక్రే ఈసీఐకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటైంది. ఉద్ధవ్‌, శిందే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తుది ఆదేశాలను జారీ చేసింది. శిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆర్నెల్ల క్రితం కమిషన్‌ ఏర్పాటవ్వగానే.. శివసేన పార్టీ పేరు, గుర్తును ఈసీఐ ఫ్రీజ్‌ చేసింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పార్టీ పేరును, వెలుగుతున్న కాగడాను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. శిందే వర్గానికి ‘బాలాసాహెబ్‌ అంచి శివసేన’ పేరును, రెండు కత్తులతో ఉన్న డాలు గుర్తును కేటాయించింది. శుక్రవారం నాటి ఆదేశాల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి-- ఈ నెల 27న జరగనున్న ఉప ఎన్నికల వరకు ఆర్నెల్ల క్రితం కేటాయించిన పార్టీ పేరు, గుర్తులు కొనసాగుతాయని త్రిసభ్య కమిషన్‌ స్పష్టం చేసింది. శిందే వర్గానికి కేటాయించిన పార్టీ పేరు, గుర్తు తక్షణం రద్దవుతాయని, ఇకపై శివసేన పేరును, విల్లు-బాణం గుర్తును ఉపయోగించుకోవొచ్చని పేర్కొంది. ‘‘ఉద్ధవ్‌ వర్గం ఈ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు.. 2018 నాటి పార్టీ రాజ్యాంగ సవరణను ఉటంకించింది. 1999 నాటి శివసేన పార్టీ రాజ్యాంగమే ఈసీఐ రికార్డుల్లో ఉంది. అందుకే.. ఉద్ధవ్‌ వర్గం లేవనెత్తుతున్న 2018 పార్టీ రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోలేం’’ అని కమిషన్‌ తన ఆదేశాల్లో తేల్చిచెప్పింది. శివసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో 76 శాతం మంది శిందే వర్గంలో ఉన్నారని, ఉద్ధవ్‌ వైపు 23.5 శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శిందేవర్గానిదే అసలైన శివసేన అని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈసీఐ నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే స్వాగతించగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం ప్రజాస్వామ్యం పాలిట ప్రమాదకరమని ఉద్ధవ్‌ విమర్శించారు. సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బుధవారం ఉద్ధవ్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

మరోవైపు పార్లమెంటు హౌస్‌లోని శివసేన కార్యాలయాన్ని (Shiv Sena Office) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికి కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక అధికారిక ప్రకటనను షేర్ చేసింది. ఆ ప్రకారం లోక్‌సభలోని 128వ నెంబర్ గదిని ఏక్‌నాథ్ షిండే క్యాంప్‌కు కేటాయించారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ బిల్డింగ్‌లోని పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గం తమ అధీనంలోకి తీసుకున్న మరుసటి రోజే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. లెజిస్లేటివ్ బిల్డింగ్‌లోని పార్టీ కార్యాలయం ఇప్పటికి వరకూ శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే చేతిలో ఉండేది.

Updated Date - 2023-03-05T22:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising