ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress Vs BJP : ఇదేం ప్రేమ?.. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ మండిపాటు..

ABN, First Publish Date - 2023-06-08T15:53:27+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.

Smriti Irani, Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Union minister Smriti Irani) మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర చేసేటపుడు, కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ‘ప్రేమ దుకాణం’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సిక్కుల ఊచకోత, రాజస్థాన్‌లో మహిళల అపహరణలు, హిందూ జీవన విధానాలను ఎగతాళి చేయడం వంటివి కూడా ‘ప్రేమ’లో భాగమేనా? అని నిలదీశారు.

స్మృతి ఇరానీ గురువారం విలేకర్ల సమావేశంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘మీరు ‘ప్రేమ’ గురించి మాట్లాడుతున్నారు, సిక్కుల ఊచకోత కూడా దీనిలో భాగమేనా? రాజస్థాన్‌లో మహిళల కిడ్నాప్‌లు కూడా దీనిలో భాగమేనా? హిందూ జీవన విధానాన్ని బహిరంగంగా ఆక్షేపించడం కూడా ‘ప్రేమ’లో భాగమేనా? భారత దేశం స్తబ్ధుగా ఉండిపోవాలని కోరుకునేవారితో కలిసి పని చేయడమేనా ‘ప్రేమ’ అంటే?’’ అని నిలదీశారు. ప్రేమ గురించి మాట్లాడుతున్నపుడు, మీ సొంత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బయటివారి జోక్యాన్ని కోరే విధంగా ఆ ప్రేమ మిమ్మల్ని నిర్బంధిస్తోందా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. భారతీయ మూలాలుగలవారితో ఆయన మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తోపాటు, బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఆయన విరుచుకుపడుతున్నారు. జవిట్స్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ, ఆరెస్సెస్‌లకు భవిష్యత్తును దర్శించే శక్తి, సామర్థ్యాలు లేవన్నారు. మీరు ఏం అడిగినా, గతంలోకి తొంగి చూస్తారన్నారు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల మాట్లాడుతూ రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, హిందూ-ముస్లింలను విభజించడం గురించి మాట్లాడుతున్నారని, సమాజాన్ని విడదీయడానికి కృషి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రేమ దుకాణాన్ని నడుపుతున్నానని చెప్తూ, విద్వేషపు మెగా షాపింగ్ మాల్‌ను తెరిచారని దుయ్యబట్టారు.

స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని అమేథీ నియోజకవర్గంలో ఓడించారు. ఆయన కేరళలోని వయనాద్‌ నుంచి గెలిచినప్పటికీ, పరువు నష్టం కేసులో ఆయనకు శిక్ష పడటంతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

ఇవి కూడా చదవండి :

Air India flight : రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులకు ఎట్టకేలకు విముక్తి

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్

Updated Date - 2023-06-08T15:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising