Rebirth : గత జన్మ సంగతులు చెప్తున్న బాలుడు.. అన్నీ నిజాలే అంటున్న కుటుంబ సభ్యులు..
ABN , First Publish Date - 2023-06-18T15:22:16+05:30 IST
పునర్జన్మ సిద్ధాంతాన్ని చాలా మంది నమ్ముతారు. ఒక జీవికి అనేక జన్మలు ఉంటాయని విశ్వసిస్తారు. కొందరు అందుకే పిల్లలతో మాట్లాడేటపుడు ‘చచ్చి నీ కడుపున పుడతాను’ అంటారు. ఇలా పుట్టడం నిజమేనని ఉత్తర ప్రదేశ్లోని మయిన్పురి జిల్లాలో ఓ బాలుడి మాటలు విన్నపుడు భావించవలసి వస్తోంది. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకుని అందరూ అవాక్కవుతున్నారు.
లక్నో : పునర్జన్మ సిద్ధాంతాన్ని చాలా మంది నమ్ముతారు. ఒక జీవికి అనేక జన్మలు ఉంటాయని విశ్వసిస్తారు. కొందరు అందుకే పిల్లలతో మాట్లాడేటపుడు ‘చచ్చి నీ కడుపున పుడతాను’ అంటారు. ఇలా పుట్టడం నిజమేనని ఉత్తర ప్రదేశ్లోని మయిన్పురి జిల్లాలో ఓ బాలుడు చెబుతున్నాడు. గత జన్మ అంటూ అతడు చెబుతున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకుని అందరూ అవాక్కవుతున్నారు.
ఎలావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళ్పుర్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ళ ఆర్యన్ దుబేను (Aryan Dubey) నైనిహాల్ రతన్పూర్ గ్రామానికి అతని తల్లి తీసుకెళ్లారు. ‘అమ్మమ్మ నీరజ్ మిశ్రా కాళ్లకు నమస్కారం చేద్దాం రా’ అని ఆ బాలుడిని పిలిచారు. అప్పుడు ఆ బాలుడు చాలా కోపంతో ‘ఆమె నా అమ్మమ్మ కాదు, నా భార్య’ అని అన్నాడు. తన మేనమామను చూపిస్తూ, ఆయన తన కుమారుడని చెప్పాడు.
గతంలో ఈ మాటలను విన్న ఆర్యన్ కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు. కానీ ఆర్యన్ పదే పదే ఇదే విషయాలను చెప్తున్నాడు. అంతేకాకుండా తాను పుట్టక ముందు జరిగిన విషయాలను కూడా చెప్తున్నాడు. (గత జన్మలో) తన పేరు మనోజ్ మిశ్రా అని, ఎనిమిదేళ్ళ క్రితం అంటే 2015 జనవరి 9న తాను పొలానికి వెళ్లినపుడు, ఓ రంధ్రంలోకి నీళ్లు వెళ్లిపోతుండటాన్ని చూశానని, ఆ రంధ్రాన్ని తాను కాలితో మూయడానికి ప్రయత్నించినపుడు తనను ఓ పాము కాటు వేసిందని, ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో తాను మరణించానని చెప్పాడు. తాను మరణించే సమయానికి తన కుమార్తె రంజన (ప్రస్తుతం ఈ బాలుడి తల్లి) గర్భిణి అని, తాను మరణించిన 13వ రోజున ఆమె ప్రసవించిందని, ఓ బాలుడు జన్మించాడని చెప్పాడు. (ఆ బిడ్డ ఈ బాలుడే). (గత జన్మలో) తన భార్య పేరు నీరజ్ మిశ్రా అని చెప్పాడు.
ఆర్యన్ దుబే చెప్తున్న మాటలన్నీ నిజమేనని అతని కుటుంబ సభ్యులు గుర్తించి, ఆశ్చర్యపోతున్నారు. ఈ బాలుడు పుట్టక ముందు విషయాలు అతనికి ఎలా తెలిశాయోనని అవాక్కవుతున్నారు. ఆర్యన్ మేనమామ అజయ్ మాట్లాడుతూ, ఈ బాలుడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి తన తల్లిని తన కూతురు అనేవాడని చెప్పారు. కానీ అతని మాటలను పట్టించుకునేవారం కాదన్నారు. కానీ ఈసారి అతను చెప్తున్న విషయాల పట్ల ఆశ్చర్యపోతున్నామన్నారు. మనోజ్ మిశ్రా, నీరజ్ మిశ్రాలకు మాత్రమే తెలిసిన విషయాలను కూడా అతను చెప్పడం తమకు మరింత ఆశ్చర్యం కలిగించిందన్నారు.
ఇవి కూడా చదవండి
Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన
Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..