ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pilot Vs Gehlot : సచిన్ పైలట్‌పై అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-30T15:54:51+05:30

రాజస్థాన్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్గ విభేదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.

Sachin Pilot, Ashok Gehlot
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రాజస్థాన్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్గ విభేదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. యువ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో సయోధ్య కుదుర్చుకునేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Chief Minister Ashok Gehlot) ముందడుగు వేస్తున్నారు. రాజకీయ సంక్షోభానికి తెరదించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు.

అశోక్ గెహ్లాట్ మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సచిన్ పైలట్‌తో కలిసి పని చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు గెహ్లాట్ స్పందిస్తూ, సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే, ఆయనతో కలిసి పని చేస్తానని పరోక్షంగా అన్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరుకుంటోందని, అందుకు తగినట్లుగా పని చేయడమే తన కర్తవ్యమని చెప్పారు. సంయమనం పాటించేవారికి సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, ‘‘మీరు నమ్మితే, మిమ్మల్ని నమ్ముతారు. అందరూ కలిసి నడిస్తే, మన ప్రభుత్వం మళ్లీ వస్తుంది’’ అని చెప్పారు.

కాంగ్రెస్ సోమవారం పొద్దుపోయాక వెల్లడించిన వివరాల ప్రకారం, పైలట్, గెహ్లాట్ రానున్న శాసన సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. తమ మధ్య సమస్యల పరిష్కార బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి వదిలిపెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు. సచిన్ పైలట్ సోమవారం సాయంత్రం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ రణధవా కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Moscow : రష్యా రాజధానిపై డ్రోన్ల దాడి

Delhi excise policy scam : మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Updated Date - 2023-05-30T15:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising