Drinking Coffee: పొద్దుపొద్దున్నే పరగడుపున కాఫీ తాగడం మంచిది కాదని అనడం లేదు.. కానీ..
ABN , First Publish Date - 2023-02-16T09:57:21+05:30 IST
పొద్దుటే లేవగానే వేడివేడిగా నురగలు కక్కే కాఫీ గొంతులో పడితే ఆ రోజంతా మనలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కాఫీలో ఉండే మ్యాజిక్కే వేరు. అలాంటి కాఫీ పొద్దుపొద్దున్నే పరగడుపునే తాగేస్తుంటాం. మరి అందరికీ ఇలా తాగడం మంచిదేనా?

Drinking Coffee: పొద్దుటే లేవగానే వేడివేడిగా నురగలు కక్కే కాఫీ గొంతులో పడితే ఆ రోజంతా మనలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కాఫీలో ఉండే మ్యాజిక్కే వేరు. అలాంటి కాఫీ పొద్దుపొద్దున్నే పరగడుపునే తాగేస్తుంటాం. మరి అందరికీ ఇలా తాగడం మంచిదేనా? అంటే అసలు డైలీ ఒక కప్పు కాఫీ తాగడంపై ముఖ్యంగా.. ఎంత పరిమాణంలో తాగుతున్నామనే దానిపై దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. అయితే కెఫీన్ (కాఫీలో ఉండే ప్రధాన పదార్ధం) జీవక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ముఖ్యంగా జన్యు వైవిధ్యాలపై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఈ కారణంగానే కొందరు ఉదయం కాఫీ తాగగానే ఉత్సాహంగా కనిపించడానికి కారణం. కానీ ఇది కొందరికి మంచిది కాకపోవచ్చు. లేదంటే వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు.
సాధారణంగా మన పనులు సక్రమంగా.. ఎలాంటి హెల్త్ డిస్టర్బెన్స్ లేకుండా నిర్వహించడానికి.. వారి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉదయం కాఫీని తీసుకుంటారు. చాలా మంది ఫిట్‌నెస్ కోసం జిమ్ తదితర ఎక్సర్‌సైజులు చేసేవారు కాఫీని తప్పక తీసుకుంటారు. ఇది ఉత్సాహంగా వ్యాయామం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక మరి కాఫీ ఉదయాన్నే తీసుకోవడం మంచిదేనా? అంటే కాదని చెప్పడం లేదు కానీ కొందరికి మాత్రం అస్సలు వద్దని నిపుణులు సూచిస్తున్నారు. గాస్ట్రిక్ సమస్య, కడుపులో అల్సర్, పేగు సిండ్రోమ్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే కాఫీ అధికంగా తాగకూడదని.. అలాగే పరగడుపున కాఫీ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది గ్యాస్ట్రిక్ సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.