ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saudi Arabia: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోనే 15వేల మంది అరెస్ట్.. 10వేల మందికిపైగా దేశ బహిష్కరణ!

ABN, First Publish Date - 2023-09-27T07:50:54+05:30

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 15వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.

జెడ్డా: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 15వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు. రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలు ఇలా పలు ఉల్లంఘనలకు పాల్పడిన సుమారు 15,054 మంది ప్రవాసులను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా వారం రోజుల వ్యవధిలోనే (ఈ నెల 14 నుంచి 20 తేదీల మధ్యలో) ఇంత భారీ మొత్తంలో అరెస్టులు జరగడం గమనార్హం.

ఇక అరెస్టైన వారిలో 9,538 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారు (Violations of Residency Laws) ఉన్నారు. మరో 3,694 మంది అక్రమంగా దేశ సరిహద్దు (Illegal Border Crossing) దాటారు. అలాగే 1,822 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు (Violations of Labor Laws) ఉన్నారు. ఇక అదుపులోకి తీసుకున్న 15,054 మందిలో చట్టపరమైన ప్రక్రియను పూర్తి అయిన 10,482 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు సౌదీ భద్రతా అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం 7,378 మంది మహిళలతో సహా మొత్తం 43,763 మంది అక్రమాస్తులపై విచారణ కొనసాగుతోందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Saudi Interior Ministry) తన వారం వారీ ప్రకటనలో పేర్కొంది.

ఇదిలాఉంటే.. రవాణా, ఆశ్రయం కల్పించడంతో సహా ఎవరైనా కింగ్‌డమ్‌లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహాయం చేసినట్లు తేలితే.. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ సౌదీ రియాళ్లు(రూ. 2.13కోట్లు) వరకు జరిమానా ఉంటుందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Saudi Ministry of Interior) హెచ్చరించింది. అలాగే వాహనాలను కూడా జప్తు చేయడం జరుగుతుందని తెలిపింది. ఇక అనుమానాస్పద ఉల్లంఘనలపై ఫిర్యాదు కోసం మక్కా, రియాద్ ప్రాంతాల వాసులు టోల్-ఫ్రీ నంబర్ 911కు, కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాల వారు 999 లేదా 996కు కాల్ చేయవచ్చని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

Saudi Arabia: సౌదీలో స్కూల్ విద్యార్థినికి 18ఏళ్ల జైలు.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..


Updated Date - 2023-09-27T07:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising