Indians in US: అమెరికాలో 97వేల మంది భారతీయుల అరెస్ట్.. పట్టుబడ్డాక అధికారులకు వారు చెబుతున్న కారణం తెలిస్తే..
ABN, First Publish Date - 2023-11-04T08:39:52+05:30
అమెరికా చేరడానికి భారతీయులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే తగిన అనుమతులు లేకుండా సుమారు 97 వేల మంది సరిహద్దులు దాటి వచ్చారని, వారిని అదుపులోకి తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
వాషింగ్టన్, నవంబరు 3: అమెరికా చేరడానికి భారతీయులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే తగిన అనుమతులు లేకుండా సుమారు 97 వేల మంది సరిహద్దులు దాటి వచ్చారని, వారిని అదుపులోకి తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు 96,917 మంది భారతీయులను అరెస్టు చేసినట్టు అమెరికా కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం తెలిపింది. వీరిలో దాదాపు 30వేల మంది కెనడా సరిహద్దులో, 40 వేల మంది మెక్సికో సరిహద్దులో పట్టుబడ్డారు. అమెరికాకు అక్రమ వలసలపై గురువారం సెనేట్‌లో చర్చ జరిగింది. ఈ అక్రమ వలసలను వ్యాపారంగా మార్చుకున్న మెక్సికోలోని ‘కార్టెల్స్’ వలసదారులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయని సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ ఆరోపించారు. పట్టుబడితే ఏమి చెప్పాలో కోచింగ్ కూడా ఇస్తున్నాయని అన్నారు. ‘సొంత దేశంలో భయం కారణంగా ఆశ్రయం కోసం వచ్చామ’ని చెప్పమంటున్నాయని వివరించారు.
Updated Date - 2023-11-04T08:40:31+05:30 IST