NRI Abducted: ఎన్నారై వ్యాపారవేత్త అపహరణ.. 10 రోజుల తర్వాత ఆచూకీ లభ్యం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..
ABN, First Publish Date - 2023-04-18T20:10:11+05:30
ఈ నెల 7న కేరళలోని తామరస్సేరికి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త (NRI Businessman) ముహమ్మద్ షఫీని(Muhammad Shafi) నలుగురు ముఠా సభ్యులు అతడి ఇంటి నుంచి అపహరించుకెళ్లారు.
ఎన్నారై డెస్క్: ఈ నెల 7న కేరళలోని తామరస్సేరికి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త (NRI Businessman) ముహమ్మద్ షఫీని(Muhammad Shafi) నలుగురు ముఠా సభ్యులు అతడి ఇంటి నుంచి అపహరించుకెళ్లారు. అయితే, దాదాపు 10 రోజుల తర్వాత ఆ ఎన్నారై ఆచూకీ లభించింది. తాజాగా కర్నాటక(Karnataka) రాష్ట్రంలో షఫీ ఆచూకీ లభించినట్లు సమాచారం. ఏప్రిల్ 14న షఫీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో అతడు తన అపహరణకు తన సోదరుడు నౌఫల్ (Naufal) కారణమని ఆరోపించాడు. తాను, తన సోదరుడు సౌదీ అరేబియా (Saudi Arabia) రాజకుటుంబం నుంచి 325 కిలోల బంగారాన్ని దొంగిలించి అక్రమంగా తరలించినట్లు షఫీ వీడియోలో షాకింగ్ విషయం చెప్పాడు. ముస్లిం చట్ట ప్రకారం తన మరణం తర్వాత తన ఆస్తి తన సోదరుడికే చెందుతుందని.. అందుకే నౌఫల్ కిడ్నాప్ చేయించినట్లు వీడియోలో పేర్కొన్నాడు.
అతనితో పాటు భార్య సెనియా (Senia) కూడా అపహరించబడింది. అయితే ఆమెను కిడ్నాపర్లు తమ ఇంటికి 150 మీటర్ల దూరంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. అపహరణకు గురైన వ్యక్తులు తెల్లటి మారుతీ స్విఫ్ట్ కారులో వచ్చారు. అప్పటికి వారు తమ ముఖాలు కప్పుకున్నారు. ఆ తర్వాత దంపతుల ప్రాంగణంలో ముఠా వాడిన కొన్ని ఆయుధాలు లభ్యమయ్యాయి. షఫీ, అతడి కిడ్నాపర్లు హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందింది. కాగా, షఫీ కిడ్నాప్ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు కాసరగోడ్ స్థానికులు ముహమ్మద్ నౌషాద్, ఇస్మాయిల్ ఆసిఫ్, అబ్దుర్ రహ్మాన్, హుస్సేన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
NRI: అమెరికాలోని భారతీయ కుర్రాళ్లూ.. మీరిది విన్నారా..? ఇక్కడ నిరుద్యోగులకు ఫ్రీగా దుస్తులు ఉతికి.. ఇస్త్రీ చేసి మరీ ఇస్తారట..!
Updated Date - 2023-04-18T20:10:11+05:30 IST