ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: కువైత్‌లోని ప్రవాస కార్మికుల సంఖ్య 24.30లక్షలు.. భారతీయుల వాటా ఎంతంటే..?

ABN, First Publish Date - 2023-09-19T10:29:38+05:30

గల్ఫ్ దేశాలలో ఒకటైన కువైత్‌ (Kuwait) లో ఆ దేశ జనాభా కంటే కూడా ప్రవాసీయులే (Expatriates) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల (Central Administration of Statistics) ప్రకారం ఆ దేశంలో ఉపాధి పొందుతున్న ప్రవాసుల సంఖ్య వచ్చేసి 24.30లక్షలకు చేరింది.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశాలలో ఒకటైన కువైత్‌ (Kuwait) లో ఆ దేశ జనాభా కంటే కూడా ప్రవాసీయులే (Expatriates) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల (Central Administration of Statistics) ప్రకారం ఆ దేశంలో ఉపాధి పొందుతున్న ప్రవాసుల సంఖ్య వచ్చేసి 24.30లక్షలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 174 దేశాలకు చెందిన వలసదారులు కువైత్‌లో ఉంటున్నారు. కాగా, గతేడాది చివరినాటికి ఈ సంఖ్య 23.40లక్షలుగా ఉంది. ఇదిలాఉంటే.. 2023 జూన్ చివరినాటికి కువైత్ లేబర్ మార్కెట్‌ (Kuwait Labour Market) లో మొత్తంగా (దేశ పౌరులు, డొమెస్టిక్ వర్కర్లు) 28.77లక్షల మంది కార్మికులు ఉన్నారు. అదే 2022 డిసెంబర్ ముగిసేనాటికి ఈ సంఖ్య 27.90లక్షలుగా ఉంది.

భారతీయ వర్కర్ల వాటా ఎంతంటే..?

ఇక కువైత్ లేబర్ మార్కెట్‌లో భారతీయ కార్మికుల (Indian Workers) వాటానే అధికం. మన వర్క్‌ఫోర్స్ వచ్చేసి ఏకంగా 30.2శాతంగా ఉంది. ఈ ఏడాది జూన్ నెల ఆఖరినాటికి భారతీయ కార్మికుల సంఖ్య 8,69,820కు చేరింది. భారత్ తర్వాత రెండో స్థానంలో ఈజిప్ట్ (Egypt) ఉంది. 4,83,450 మంది ఈజిప్టియన్లు కువైత్‌లో పని చేస్తున్నారు. ఇక కువైటీలు 4,47,060 మంది వర్కర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా నాలుగు, ఐదు స్థానాలలో ఫిలిప్పీన్స్ (2,69,480), బంగ్లాదేశ్ (2,48,920) ఉన్నాయి.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో గృహకార్మికులు కాకుండా ఇతర వర్కర్లు 52వేలు పెరిగినట్లు తాజాగా విడుదలైన డేటా చెబుతోంది. ప్రస్తుతం డొమెస్టిక్ వర్కర్లు (Domestic Workers) కాకుండా కువైత్ లేబర్ ఫోర్స్ వచ్చేసి 20.88 లక్షలుగా ఉంది. ఇక ఆ దేశంలో గృహ కార్మికులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. 2023లో మొదటి ఆరు నెలల్లోనే 34,850 మంది కార్మికులు పెరిగారు. దీంతో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య 7,88,150కి చేరింది. అదే 2022 డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 7,53,290గా ఉంది.

UAE-India travel: భారత ప్రవాసులు కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు.. పైగా 200కేజీల వరకు లగేజీకి అనుమతి


Updated Date - 2023-09-19T10:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising