ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

US: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ఏడాది చెల్లిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న..!

ABN, First Publish Date - 2023-07-18T11:37:46+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. అనుకోకుండా మూడేళ్ల బాలుడు తన చెల్లిపై తుపాకీ (Gun) పేల్చడంతో చనిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాండియాగో: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. అనుకోకుండా మూడేళ్ల బాలుడు తన చెల్లిపై తుపాకీ (Gun) పేల్చడంతో చనిపోయింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాండియాగోలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శాండియాగో కౌంటీలోని ఫాల్‌బ్రూక్ అనే ప్రాంతంలో ఓ ఇంట్లో మూడేళ్ల బాలుడు హ్యాండ్‌గన్‌ (Handgun) తో ఆడుకుంటున్న సమయంలో బాలుడి చేతిలోని తుపాకీ పేలింది. దాంతో ఎదురుగా ఉన్న అతడి సోదరి తలకు బులెట్ తగిలింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని అగ్నిమాపక సిబ్బంది వెంటనే సమీపంలోని పలోమర్ హాస్పిటల్ (Palomar Hospital) కి తరలించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అమెరికాలో గన్‌కల్చర్‌ పెట్రేగిపోతోంది. ఆ దేశంలో జరిగే హత్యల్లో 79శాతం గన్‌లు ఉపయోగించి జరుగుతున్నవేనని తెలుస్తోంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళవరకు చాలామంది చేతుల్లో తుపాకులుంటున్నాయి. ఇలా తుపాకులు ఉంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం లైసెన్సులు చాలా తేలిగ్గా ఇచ్చేస్తుంది. దాంతో చాలామంది గన్స్ కొనుక్కుంటున్నారు. ఇక యూఎస్ చట్టాల ప్రకారం తుపాకులు కలిగి ఉండటం ప్రజల వ్యక్తిగత స్వేచ్చ. అందుకనే అడిగిన వాళ్ళకి అడిగినట్లు ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చేస్తోంది.

Indian Woman: ఐర్లాండ్‌లో ఘోరం.. భారతీయ మహిళ దారుణ హత్య.. జ్యుడీషియల్ కస్టడీకి భర్త..!


Updated Date - 2023-07-18T11:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising