Kuwait: వామ్మో.. దేశం విడిచి వెళ్లే ప్రవాసుల నుంచి కువైత్ ఎంత వసూలు చేసిందో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-09-26T10:48:44+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల దేశం విడిచి వెళ్లే ప్రవాసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల దేశం విడిచి వెళ్లే ప్రవాసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏ కారణంతోనైనా సరే.. దేశం విడిచి వెళ్లడానికి ముందు ప్రవాసులు (Expats) తప్పనిసరిగా బకాయి పడ్డ ట్రాఫిక్ చలాన్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, న్యాయశాఖ సంబంధిత చెల్లింపులు క్లీయర్ చెల్లించాల్సిందేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా సెప్టెంబర్ 1 నుంచి 23వ తేదీ వరకు ప్రవాసులు, జీసీసీ దేశాల పౌరుల నుంచి బకాయిల రూపంలో కువైత్ ఏకంగా 4.077 మిలియన్ దినార్లు (రూ.109.66కోట్లు) వసూలు చేసింది. ఇందులో 1 మిలియన్ దినార్లకు పైగా ట్రాఫిక్ చలాన్ల తాలూకు బకాయిలు ఉన్నాయి. అలాగే సుమారు 2.936 కేడీలు వచ్చేసి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లులు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ఈ బకాయిలను విదేశీయులు సంబంధిత మంత్రిత్వశాఖల అధికారిక వెబ్‌సైట్లు లేదా సహేల్ యాప్ (Sahel app) ద్వారా చెల్లించే ఏర్పాటు చేసింది.
Domestic workers: భారత ఎంబసీ కీలక సలహాలు.. గృహ కార్మికులుగా పనిచేసే మనోళ్లు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి కూడా..
Updated Date - 2023-09-26T10:48:44+05:30 IST