NRI: చంద్రబాబుకి సంఘీభావంగా.. సిడ్నీలో ప్రవాసాంధ్రుల పాదయాత్ర
ABN, First Publish Date - 2023-10-15T10:14:09+05:30
చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అనేక దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు వివిధ పద్దతులలో చంద్రబాబుకి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.
NRI: చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అనేక దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు వివిధ పద్దతులలో చంద్రబాబుకి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ నగరంలోని తెలుగువారు తమ నాయకుడికి న్యాయం జరగాలని కాంక్షిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్ట్రాత్ ఫీల్డ్‌లో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అక్కడి నుండి హెలెన్స్ బెర్గ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు దాదాపుగా 48 కిలోమీటర్లు పాదయాత్ర వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో చంద్రబాబు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. తెలుగురాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమించిన దార్శనికుడు చంద్రబాబు అని, అటువంటి నాయకుడిని అక్రమ కేసులతో నెల రోజులుగా జైలులో నిర్బంధించటం దారుణమని మండిపడ్డారు. ఆయనకు సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర నిర్వహించినట్లు వారు తెలియజేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ది చేయటం చేతకాని జగన్ ఇలా దొడ్డిదారిలో ప్రతిపక్షాల నోరు నొక్కటం ద్వారా మరోసారి గెలవాలని చూస్తున్నాడని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో సైకో పాలన అంతం కావాలని, రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా విజయం సాధించి గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ది పట్టాలెక్కించాలని భగవంతుని ప్రార్ధించినట్లు తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలిపారు.
Updated Date - 2023-10-15T10:14:09+05:30 IST