ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu Girl: లండన్‌లో ఉన్మాది ఘాతుకం.. తెలుగమ్మాయి మృతి!

ABN, First Publish Date - 2023-06-14T10:56:20+05:30

విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: విదేశీ విద్య కోసం లండన్ (London) వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై (Telugu Girls) కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. లండన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలు) ఘటన చోటు చేసుకుంది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ (Brazil) యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. మరో యువతి అఖిల తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తేజస్విని, అఖిల మరికొంత మంది స్నేహితులతో కలిసి లండన్‌లో ఉంటున్నారు.

Real Estate: స్వదేశంలో పెట్టుబడులకు ఎన్నారైల ఆసక్తి.. ఆ రెండు నగరాలే మనోళ్ల టార్గెట్.. సర్వేలో బయటపడిన ఆసక్తికర విషయాలు..

ఎంఎస్‌ కోసం రెండున్నరేళ్ల క్రితం తేజస్విని లండన్ వెళ్ళింది. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్‌లో చదువుతోంది. ప్రస్తుతం వెంబ్లి ప్రాంతంలోఉంటుంది. కాగా, దాడికి పాల్పడిన బ్రెజిల్‌కి చెందిన వ్యక్తి తేజస్విని ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండే వారని సమాచారం. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట. ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రిషన్. మృతురాలు తేజస్విని అన్న పవన్ కుమార్ రెడ్డి అస్ట్రేలియలో ఉంటాడు. ఆమె మూడు నెలల క్రితం హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే, ఆగస్ట్‌లో వస్తానని తేజస్విని తన తల్లితండ్రులతో చెప్పింది. దాంతో తేజస్వినికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు ఆమె తల్లి రమాదేవి అన్నారు. అంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక దుండగుడి దాడిలో గాయపడిన మరో అమ్మాయి అఖిలది జనగాం జిల్లా ఆలేరుగా తెలిసింది.

Saudi Arabia: ఆ వీసాదారులకు సౌదీ అరేబియా తీపి కబురు.. అలా చేస్తే సౌదీలో ఎంట్రీ చాలా ఈజీ..!

Updated Date - 2023-06-14T12:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising