Indians: దుబాయి రియల్ ఎస్టేట్ మార్కెట్.. అతిపెద్ద పెట్టుబడిదారు జాబితాలో భారతీయులు
ABN, First Publish Date - 2023-07-15T10:14:45+05:30
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దుబాయి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో (Dubai’s real estate market) అతిపెద్ద పెట్టుబడిదారుల జాబితాలో బ్రిటిషర్లతో పాటు భారతీయులు, రష్యన్లు మొదటిస్థానంలో నిలిచారు.
దుబాయి: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దుబాయి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో (Dubai’s real estate market) అతిపెద్ద పెట్టుబడిదారుల జాబితాలో బ్రిటిషర్లతో పాటు భారతీయులు, రష్యన్లు మొదటిస్థానంలో నిలిచారు. ఈ మేరకు బెటర్ హోమ్స్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయంలో వెల్లడైంది. అటు పాకిస్తాన్ పెట్టుబడిదారులకు కూడా దుబాయిలో రియల్ ఎస్టేట్ అతిపెద్ద కొనుగోలుదారులలో టాప్-10లో చోటు దక్కడం గమనార్హం.
కాగా, కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత భారత ఉపఖండం, ఐరోపా, ఇతర ప్రాంతాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించినట్లు బెటర్ హోమ్స్ (Betterhomes) తన నివేదికలో వెల్లడించింది. అలాగే ఈ ఏడాది చివరి వరకు 4,500 మంది మిలినీయర్లను యూఏఈ ఆకర్షిస్తుందని రిపోర్ట్ అంచనా వేసింది. 2022లో 5,200 మంది మిలినీయర్లు (Millionaires) యూఏఈకి వలస వెళ్లారు. ఇక దుబాయి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోని అతిపెద్ద పెట్టుబడిదారుల జాబితాలోని టాప్-10 దేశాలివే.. ఇండియా, యూకే, రష్యా, ఈజిప్ట్, యూఏఈ, టర్కీ, పాకిస్థాన్, ఇటలీ, లెబనాన్, ఫ్రాన్స్.
Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?
Updated Date - 2023-07-15T10:15:41+05:30 IST