ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK Police Officer: సింప్లీ సూపర్బ్.. ఇండియన్స్‌తో కలిసి బ్రిటీష్ పోలీస్ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-03-22T12:48:27+05:30

లండన్‌లోని (London) భారత హై కమిషన్ కార్యాలయంపై (Indian High Commission) ఖలిస్తానీ మద్దతుదారులు (Khalistan Supporters) దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్నారై డెస్క్: లండన్‌లోని (London) భారత హై కమిషన్ కార్యాలయంపై (Indian High Commission Office) ఖలిస్తానీ మద్దతుదారులు (Khalistan Supporters) దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. భారతీయ జాతీయ జెండాను కిందికి దించి వారి జెండాను ఎగిరేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది కూడా. పంజాబ్‌లో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ (Amrithpal Singh) కోసం పోలీసులు వెతుకుతుండటం, అతని మద్దతుదారులను అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో లండన్‌లో పలువురు ఖలిస్తానీ మద్దతుదారులైన సిక్కులు నిరసనలు తెలిపారు. భారత హై కమిషన్ కార్యాలయం​వద్దకు చేరుకుని, భవనంపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. దాంతో ధీటుగా స్పందించిన హైకమిషన్ అధికారులు ఓ పెద్ద జాతీయ జెండాను ఆఫీస్ ముందు కట్టడం జరిగింది.

ఇదిలాఉంటే.. ఖలిస్తాన్ మద్దతుదారుల దాడిని వ్యతిరేకిస్తూ హై కమిషన్ భవనం ముందు భారతీయ కమ్యూనిటీ (Indian Community) వారు తాజాగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిక్ అనే ఓ బ్రిటీష్ పోలీస్ అధికారి (British Police Officer).. భారతీయ ఆందోళనకారులతో (Protesters) కలిసి సరదాగా గడిపారు. నిరసనకారులతో కలిసి బాలీవుడ్ పాటకు స్టెప్పులు వేశారు. దీనికి తాలూకు వీడియోను సిద్దాంత్ సిబల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేయడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీస్‌ అధికారికి ఓ భారతీయ యువతి పాటకు తగ్గట్టుగా స్టెప్పులు నేర్పడం మనం వీడియోలో చూడొచ్చు. కాగా, భారతీయుల (Indians) ఐక్యతకు ఈ నిరససనలు ఓ ప్రతీక అని, తమపై దాడి జరిగిన ప్రతీసారి రెట్టింపు సంఖ్యలో వచ్చి ఇలా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన ఓ మహిళ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రముఖ సీనియర్ నటి కుమార్తెకు యూఏఈ 'గోల్డెన్ వీసా'..!

Updated Date - 2023-03-22T12:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising