ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: 'ట్రంప్ ఈజ్ బ్యాక్'.. రెండేళ్ల తర్వాత మాజీ అధ్యక్షుడి ఎఫ్‌బీ, యూట్యూబ్ ఖాతాలపై తొలిగిన బ్యాన్..!

ABN, First Publish Date - 2023-03-18T10:24:33+05:30

2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి (Capitol Attack) నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US Former President Donald Trump) సోషల్ మీడియా ఖాతాలపై (Social Media Accounts) బ్యాన్ పడింది (Banned).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వాషింగ్టన్: 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి (Capitol Attack) నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US Former President Donald Trump) సోషల్ మీడియా ఖాతాలపై (Social Media Accounts) బ్యాన్ పడింది (Banned). ప్రధాన సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్ (మెటా- Meta), ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ (YouTube) ఇలా వరుస పెట్టి ముకుమ్మడిగా సోషల్ మీడియా సైట్లు (Social Media Sites) ట్రంప్‌ను బ్యాన్ చేశాయి. క్యాపిటల్ హిల్స్ భవనంలో హింస చెలరేగేలా తన ఫాలోవర్లను ప్రేరేపించినందుకు ఆయన ఖాతాలపై నిరవధిక నిషేధం విధించాయి. అయితే, ఆ ఖాతాలను దాదాపు రెండేళ్ల తర్వాత ఒక్కొక్కటిగా ఇప్పుడు బ్యాన్ తొలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే 'మెటా'.. ట్రంప్ ఖాతాలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. అన్నట్లుగానే గత నెలలో ఇన్‌స్టాగ్రాం ఖాతాను పునరుద్ధరించింది.

తాజాగా ఫేస్‌బుక్ (Facebook), యూట్యూబ్ ఖాతాలపై కూడా బ్యాన్ తొలిగిపోయింది. రెండేళ్ల తర్వాత ఆయన ఎఫ్‌బీ, యూట్యూబ్ శుక్రవారం పునరుద్ధరించబడ్డాయి. దాంతో ట్రంప్ నిన్న తన ఫేస్‌బుక్ పేజీతో పాటు యూట్యూబ్‌లో "I'M BACK!" అనే క్యాప్షన్‌తో 2016లో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మాట్లాడిన వీడియోను ట్రంప్ షేర్ చేశారు. ఇక ఈ ఖాతాలపై నిషేధానికి ముందు ఆయనకు ఇన్‌స్టాగ్రాంలో 23 మిలియన్ల మంది ఫాలోవర్లు, ఎఫ్‌బీలో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా సోషల్ మీడియా వేదికగానే ఆయన భారీగా నిధులు సమకూర్చుకున్నారు. 2024లో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ పునరుద్ధరించబడడం కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: వామ్మో.. నిత్యానంద లీలలు మాములుగా లేవుగా.. ఏకంగా అమెరికాలోని 30 నగరాలకే ఎసరు..!

అటు మరో సోషల్ మీడియా బ్లాగింగ్ ట్విటర్ (Twitter) సైతం ఇప్పటికే ట్రంప్ ఖాతాను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ట్విటర్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) నవంబర్‌లో అతని ట్విటర్ ఖాతాను పునరుద్ధరించారు. అయితే, ట్రంప్ ఇంకా ట్విటర్‌లో పోస్ట్ చేయలేదు. ఇదిలాఉంటే.. తన సోషల్ మీడియా ఖాతాలపై బ్యాన్ విధించిన తర్వాత ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం 'ట్రూత్ సోషల్'ను (Truth Social) ప్రారంభించిన విషయం విదితమే. ఇతర సామాజిక మాధ్యమాలు తనకు అవసరం లేదని ఇలా సొంతంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంను తీసుకొచ్చారాయన. ఇప్పుడు ఒక్కొక్కటిగా సామాజిక మాధ్యమాలు ఆయన ఖాతాలపై నిషేధాన్ని తొలగిస్తుండడంతో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు తిరిగి ఈ వేదికలపై ట్రంప్ యాక్టివ్ అవుతారేమో చూడాలి మరి.

ఇది కూడా చదవండి: భిక్షాటన చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయి అధికారులు.. అతడి వద్ద ఉన్న నగదును చూసి నోరెళ్లబెట్టారు..!

Updated Date - 2023-03-18T11:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising