Kuwait: ప్రవాసులకు కువైత్ మరో ఝలక్.. ఆ దేశం విడిచివెళ్లేవారు ఇకపై తప్పనిసరిగా..!
ABN, First Publish Date - 2023-09-07T07:48:34+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Gulf Contry Kuwait) ప్రవాసులకు మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే దేశం విడిచివెళ్లే వలసదారులు (Expats) తప్పనిసరిగా బకాయి పడ్డ ట్రాఫిక్ చలాన్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు చెల్లించాల్సిందేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Gulf Contry Kuwait) ప్రవాసులకు మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే దేశం విడిచివెళ్లే వలసదారులు (Expats) తప్పనిసరిగా బకాయి పడ్డ ట్రాఫిక్ చలాన్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు చెల్లించాల్సిందేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Justice) చెల్లింపులను క్లియర్ చేయడం తప్పనిసరి అని వెల్లడించింది. గురువారం (7వ తేదీ) నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of Interior) స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా సరే దేశం విడిచి వెళ్లే ప్రతి విదేశీయుడు (Foreigner) న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్ లేదా సహేల్ యాప్ (Sahel App) ద్వారా బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. అంతర్గత మంత్రిత్వశాఖ బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. బిల్లు చెల్లించిన తర్వాతే స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతించేలా ప్రత్యేక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. సమాచార మంత్రిత్వశాఖ (Ministry of Communication) కు చెందిన అధికారిక వెబ్‌సైట్ లేదా సహేల్ యాప్ ద్వారా బిల్లులను చెల్లించే ఏర్పాటు చేసింది. అలాగే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులకు ఇంతకుముందు ట్రాఫిక్ జరిమానాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్‌ను చెల్లించడం కూడా తప్పనిసరి చేసిన విషయం విదితమే.
Green Card: అమెరికా గ్రీన్‌కార్డు అందుకోకుండానే.. 4లక్షల మంది భారతీయులు చనిపోతారట.. నివేదికలో విస్మయకర విషయాలు..!
Updated Date - 2023-09-07T07:49:23+05:30 IST