NRI: విషాదం.. యూఎస్‌లో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి.. ఇంట్లోనే విగతజీవులుగా దంపతులు, ఆరేళ్ళ కొడుకు!
ABN, First Publish Date - 2023-08-20T10:46:54+05:30
అగ్రరాజ్యం అమెరికా (America) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబం (Indian Family) మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలోని తమ నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
ఇంట్లోనే దంపతులు, ఆరేళ్ళ కుమారుడి మృతదేహాలు
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబం (Indian Family) మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలోని తమ నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో లేదా మరేదైనా ఘోరం జరిగిందో తెలిదుగానీ దేశంకాని దేశంలో ఇలా ముగ్గురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపించడం అందరిని కలిచి వేసింది. ఉపాధి నిమిత్తం కర్నాటక (Karnataka) కు చెందిన దంపతులు తొమ్మిదేళ్ల కింద యూఎస్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే, ఏమైందో తెలియదుగానీ ఆరేళ్ళ కుమారుడితో సహా దంపతులు మృతిచెందారు. ఈ మేరకు స్వదేశంలోని కుటుంబ సభ్యులకు అమెరికన్ పోలీసులు సమాచారం అందించారు. వారు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక రాష్ట్రం దావణగెరె జిల్లా జగళూరు సమీపంలోని హలేకల్లు గ్రామానికి చెందిన యోగేష్ హొన్నాల (Yogesh Honnala) దంపతులకు మంచి ఉద్యోగం రావడంతో 9ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. యోగేశ్‌తో పాటు భార్య ప్రతిభ కూడా సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమారుడు యష్ ఉన్నాడు. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలో (Baltimore region in Maryland) ఈ ఫ్యామిలీ నివాసం ఉండేది. అయితే, ఏమైందో తెలీదు శనివారం యోగేష్ కుటుంబం చనిపోయిన విషయం స్వదేశంలోని కుటుంబ సభ్యులకు బాలిమోర్ట్ పోలీసుల ద్వారా తెలిసింది. వారి మరణవార్తతో హలేకల్లు గ్రామంలో విషాదం అలుముకుంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భార్యాబిడ్డతో కలిసి సూసైడ్ (Suicide) చేసుకోవాల్సిన సమస్యలేవీ తన కుమారుడికి లేవని యోగేష్ తల్లి శోభ అన్నారు. గత గురువారమే తనకు కొడుకు ఫోన్ చేశాడని, ఎంతో బాగా మాట్లాడాడని ఆమె బోరున విలపించారు. కొడుకు, కోడలు, మనవడిని తలచుకుని శోభ గుండెలవిసేలా విలపించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. సాధ్యమైనంత త్వరగా వారి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Entry Permit: దుబాయి వెళ్తున్నారా? అయితే ఈ కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ గురించి తెలుసుకోండి..!
Updated Date - 2023-08-20T10:53:11+05:30 IST