Viral News: ఓ భారతీయ విద్యార్థికి ఊహించని షాకిచ్చిన విదేశీ ప్రొఫెసర్.. ఇంటర్న్‌షిప్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన మెయిల్‌లో..!
ABN, First Publish Date - 2023-10-27T08:53:58+05:30
భారతీయ విద్యార్థి (Indian Student) చేసిన రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేస్తూ జర్మన్ ప్రొఫెసర్ (German Professor) ఊహించని రిప్లై ఇచ్చారు. దాంతో నిర్ఘాంతపోవడం మనోడి వంతైంది.
Viral News: భారతీయ విద్యార్థి (Indian Student) చేసిన రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేస్తూ జర్మన్ ప్రొఫెసర్ (German Professor) ఊహించని రిప్లై ఇచ్చారు. దాంతో నిర్ఘాంతపోవడం మనోడి వంతైంది. ఆ విదేశీ ప్రొఫెసర్ ఇండియన్ స్టూడెంట్‌కు పంపించిన షాకింగ్ మెయిల్ తాలూకు స్క్రిన్‌షాట్ కాస్తా బయటకు రావడంతో ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. భారతీయ విద్యార్థి ఒకరు జర్మనీలోని కార్ల్సరుహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Karlsruhe Institute of Technology) లో రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ కోసం ఓ ప్రొఫెసర్‌కు మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపారు. అయితే, భారతీయ విద్యార్థి రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన ఆ జర్మన్ ప్రొఫెసర్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
"నీవు ఇక్కడికి రావడానికి విమానం ఎక్కి వచ్చావు. తద్వారా ఇప్పటికే భారీ గాలి కాలుష్యం కావడానికి కారణమయ్యావు. అందుకే నిన్ను ఇక్కడికి ఆహ్వానించలేను. నీ ఇంటర్న్‌షిప్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేస్తున్నాను. నీవు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ కూడా కాలుష్యం కాకుండా చూసుకో" అని ప్రొఫెసర్ రిప్లై ఇచ్చారు. అది చూసిన భారతీయ విద్యార్థి కంగుతిన్నాడు. వెంటనే ఆ మెయిల్‌ను తన స్నేహితుడికి ఫార్వర్డ్ చేశాడు. అతడు ఆ మెయిల్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతా (@sayharshit) లో పోస్ట్ చేశాడు. 'నా స్నేహితుడు జర్మనీలో రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ కోసం ఒక జర్మన్ ప్రొఫెసర్‌కి మెయిల్ పంపాడు! ఇక్కడ స్పందన ఏమిటో మీరే చూడండి. ఈ వ్యాఖ్యను ఎవరైనా వివరిస్తారా?' అంటూ హర్షిత్ తివారీ ట్వీట్ చేశాడు. దాంతో ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'ఓ మై గాడ్.. నిజంగా జర్మన్లు రూడ్' అని కామెంట్ చేశాడు.
IAS Officer Video: ఐఏఎస్ ఆఫీసర్‌వు అయి ఉండి ఇవేం పనులయ్యా..? ఇది కరెక్టేనా..? అంటూ నెట్టింట పేలుతున్న సెటైర్ల వెనుక..!
Updated Date - 2023-10-27T12:04:08+05:30 IST