ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచిత ప్రవేశంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

ABN, First Publish Date - 2023-11-10T07:18:26+05:30

కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్ (Indian Community School Kuwait) తీపి కబురు అందించింది.

కువైత్ సిటీ: కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్ (Indian Community School Kuwait) తీపి కబురు అందించింది. మనోళ్ల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ డిసెంబర్ 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది. వేదిక వచ్చేసి సాల్మియాలోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్, సీనియర్ బ్రాంచీ. ఇక ఈ ఉన్నత విద్యా మేళా అనేది భారతదేశం, విదేశాలలో ఉన్నత విద్య కోసం అడ్మిషన్లు కోరుకునే తల్లిదండ్రులు, విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ బిజినెస్ స్కూల్స్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలు, హెల్త్ సైన్సెస్, హ్యూమానిటీస్, మేనేజ్‌మెంట్ కాలేజ్, అర్కిటెక్చర్ అండ్ డిజైన్ కాలేజ్, లా కాలేజ్, కులినరీ ఆర్ట్స్, హస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఇండియా మరియు విదేశాలలోని టూరిజం మేనేజ్‌మెంట్ యూనివర్సిటీస్ ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి.

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

ఇక ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కువైత్‌లోని యువ భారతీయ ప్రవాసుల (Indian Expats) స్టడీస్ పరమైన అవసరాలను తీర్చడానికి వన్-స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇది విద్యార్థులు.. ఇండియా, విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల ప్రతినిధులతో ముఖాముఖిగా కలుసుకోవడంతో పాటు అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, దరఖాస్తులపై వారి సలహాలు, సూచనలు పొందడానికి చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే కెరీర్ కన్సల్టెంట్లు వేదిక వద్ద విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో భాగంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ కెరీర్ కోచ్‌ సజిత్ థామస్ ఆధ్వర్యంలో స్టూడెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా నిర్వహించబడుతుంది. ఈ ఆప్టిట్యూడ్ పరీక్ష అనేది విద్యార్థులకు వారి భవిష్యత్ ఉద్యోగాలను వారి నైపుణ్య సెట్‌లకు మ్యాప్ చేయడంలో సహాయపడుతుంది. ఈ పరీక్ష 100% పిల్లల యోగ్యత, ఆసక్తులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

GCC: గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు పండగలాంటి వార్త.. ఇకపై..


ఈవెంట్‌కు ప్లాటినం స్పాన్సర్స్‌గా మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE), యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్- దుబాయ్ వ్యవహరిస్తున్నాయి. ఇక గోల్డ్ స్పాన్సర్‌లుగా యూనివర్సిటీ ఆఫ్ నార్తాంప్టన్, వీఐటీ వెల్లూర్, ఎస్ఆర్ఏం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బిట్స్ పిలానీ - దుబాయ్ క్యాంపస్, ఎన్ఐటీటీఈ, జైన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ వెస్ట్ లండన్, సింబియోస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, ఏంఐటీ- వరల్డ్ పీస్ యూనివర్శిటీ, రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా్యి. అలాగే పీఎస్‌జీఆర్ పీఎస్‌జీఆర్ కృష్ణమ్మాళ్ కాలేజ్ ఫర్ ఉమెన్, బీఎమ్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం, అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ కువైత్ (American University of Kuwait), పింప్రి చించ్‌వాడ్ ఎడ్యుకేషన్‌ట్రస్ట్, VMIIHE - V. M. సల్గోకర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్, అజీంక్య డీవై పాటిల్, యూనివర్సిటీ ఆఫ్ గ్వెల్ఫ్, జర్మన్ ఇంటర్నేషనల్ కాలేజ్ - జర్మనీ, డీఈ మోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయం, HTMi హోటల్, టూరిజం మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ స్విట్జర్లాండ్, ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, దుబాయ్, ఐడీపీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్‌లు, గీతం యూనివర్సిటీ, సెయింట్ జార్జ్ స్కూల్ ఆఫ్ మెడికల్ అండ్ మహీంద్రా యూనివర్శిటీ, మరెన్నో విశ్వవిద్యాలయాలు అసోసియేట్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఈవెంట్ ఎక్స్ఛేంజ్ పార్టనర్ అల్ ముజైనీ ఎక్స్ఛేంజ్

ఫెయిర్ సందర్శకులకు వారి ఎంట్రీని ముందుగా నమోదు చేసుకోవడం ద్వారా Certina 1888 DS పోడియమ్‌ చేతి వాచీలను గెలుచుకునే ప్రత్యేక అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఈ ఫెయిర్‌కు హాజరు కావాలనుకునే వారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవచ్చు. రెండు రోజులూ ఫెయిర్‌కు అందరికీ ప్రవేశం ఉచితం.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

Updated Date - 2023-11-10T07:23:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising