Big Ticket: బర్త్‌డే నాడు కొన్న లాటరీ టికెట్.. దుబాయిలోని భారత ప్రవాసుడికి కోట్లు తెచ్చిపెట్టింది!
ABN, First Publish Date - 2023-08-06T08:03:18+05:30
అదృష్టం అనేది ఎవరిని ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదిగో దుబాయిలో ఉండే ఈ భారత ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. లాటరీ రూపంలో అదృష్టం వరించింది. బర్త్‌డే (Birthday) నాడు అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్.. కోట్లు తెచ్చిపెట్టింది.
అబుదాబి: అదృష్టం అనేది ఎవరిని ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదిగో దుబాయిలో ఉండే ఈ భారత ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. లాటరీ రూపంలో అదృష్టం వరించింది. అది కూడా తన బర్త్‌డే (Birthday) నాడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్.. అతనికి కోట్లు తెచ్చిపెట్టింది. నెలకు 4వేల దిర్హమ్స్‌కు (రూ.90వేలు) ఉద్యోగం చేసే భారతీయుడికి (Indian) అబుదాబి బిగ్ టికెట్ గ్రాండ్ ప్రైజ్ (Dhabi Big Ticket's Grand Prize) రూపంలో రాత్రికి రాత్రే రూ. 33.76కోట్లు వచ్చి పడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. సకిల్ ఖాన్ సర్వర్ ఖాన్ (Sakil Khan Sarwar Khan) అనే భారత ప్రవాసుడు ఉద్యోగం కోసం 2011లో దుబాయి వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరింగ్ కోఆర్డినేటర్‌గా జాబ్ చేస్తున్నాడు. నెలకు అతడి శాలరీ రూ.90వేలు. అయితే, అతడు తన కొంతమంది స్నేహితులతో కలిసి 2015 నుంచి అబుదాబి బిగ్ టికెట్ (Abu Dhabi Big Ticket) లో క్రమం తప్పకుండా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో జూలై 25న తన పుట్టినరోజున నం.191115 లాటరీ టికెట్ కొన్నాడు. తాజాగా నిర్వహించిన బిగ్ టికెట్ డ్రాలో సకిల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నంబర్‌కు జాక్‌పాట్ తగిలింది. విజేతగా నిలిచిన అతడు 15మిలియన్ దిర్హమ్స్ (రూ. 33.76కోట్లు) గెలుచుకున్నాడు.
Indian American: హిందీలో మాట్లాడడమే ఈ భారతీయ వ్యక్తి చేసిన తప్పు.. ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికన్ కంపెనీ
ఈ సందర్భంగా సకిల్ ఖాన్ మాట్లాడుతూ.. "నా బర్త్‌డే జూలై 25. ఇది నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజు అని భావించాను. అదే రోజు బిట్ టికెట్ లాటరీలో టికెట్ నం.191115 కొన్నాను. అదే నాకు ఇవాళ కలిసొచ్చింది. ఇది పార్టీ టైం. నేను 2015 నుంచి లక్కీ డ్రాలో పాల్గొంటున్నాను. లాటరీ టికెట్ కొనుగోలు చేయడానికి డబ్బు సేకరించడం కోసం మేము కొంతమంది స్నేహితులం ఒక గ్రూపుగా ఏర్పడ్డాం. మాది 10-15 మందితో కూడిన గ్రూపు. గ్రూపులోని ప్రతి సభ్యుడు 50 నుంచి 100 దిర్హమ్స్ వరకు అందజేస్తాడు. నా వంతుగా ప్రతినెలా 50దిర్హమ్స్ పక్కన పెట్టేవాడిని. చివరకు నా బర్త్‌డే నాడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ మాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. చాలా ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సకిల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక తన వాటాగా వచ్చే నగదుతో తన బాకీ తీరిపోవడంతో పాటు పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని తెలిపాడు.
Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!
Updated Date - 2023-08-06T08:25:52+05:30 IST